క్రిష్ ను కరుణంచిన పవన్

మొత్తానికి డైరక్టర్ క్రిష్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరుణ చూపించారు. ఏకంగా పది రోజులు షూట్ చేసుకోవడానికి ఓకే అన్నారు. డిసెంబర్ లో పది రోజులు కాల్ షీట్ల ఇచ్చారు. Advertisement…

మొత్తానికి డైరక్టర్ క్రిష్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరుణ చూపించారు. ఏకంగా పది రోజులు షూట్ చేసుకోవడానికి ఓకే అన్నారు. డిసెంబర్ లో పది రోజులు కాల్ షీట్ల ఇచ్చారు.

అల్యూమినియం ఫ్యాకర్టీలో వేసిన సెట్ లో వున్న బ్యాలన్స్ వర్క్ ను ఫినిష్ చేస్తారు. ఆ తరువాత పవన్ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ మీదకు వెళ్తారు. అది పూర్తయ్యాకనే మళ్లీ క్రిష్ సినిమాకు వస్తారు.

విషయం ఏమిటంటే పవన్ రీ ఎంట్రీ తరువాత అన్నింటికన్నా ముందుగా క్రిష్ సినిమానే చేయాలి. ఎందుకంటే ఏనాడో జమానా కాలం నాడు నిర్మాత ఏఎమ్ రత్నం అయిదు కోట్లు అడ్వాన్స్ ఫైనాన్షియర్ సత్తి రంగయ్య ద్వారా ఇచ్చి వున్నారు. కానీ పవన్ రీ ఎంట్రీ ఇస్తూనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాదిరిగా వకీల్ సాబ్ ను స్టార్ట్ చేసారు.

దాంతో పాటు బాగుండదన్నట్లుగా ఎఎమ్ రత్నం-క్రిష్ సినిమా కూడా ఓ చిన్న షెడ్యూలు చేసారు. వకీల్ సాబ్ తరువాత అయినా చేస్తారేమో అనుకుంటే మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా అయ్యప్పన్ రీమేక్ వచ్చి పడింది.

చేసేది లేక, కనీసం వేసిన సెట్ లో వర్క్ అన్నీ ఫినిష్ చేయమని దర్శకుడు క్రిష్ పదే పదే వేడుకున్నట్లు బోగట్టా. ఆఖరికి జనసేనాధిపతి మనసు కరిగి, 'అటులనే చేసెద' అని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. 

డిసెంబర్ షెడ్యూలు తరువాత మళ్లీ పవన్ ఈ సినిమాకు రావాలంటే కనీసం రెండు నెలలు అయినా పడుతుందేమో? ఈ లెక్కన ఎప్పటికి పూర్తవుతుందో క్రిష్ సినిమా?

మన ప్రతాపం అంతా ఆంధ్రలోనే