2018 సమ్మర్ లో విడుదలయింది భరత్ అనే నేను. ఈ సమ్మర్ కు రెండేళ్లు పూర్తి చేసుకుంటుంది. కానీ ఇప్పటి వరకు కొరటాల శివ నుంచి మరో సినిమా రాలేదు. ఆయన పొరపాటునో, గ్రహపాటునో వెళ్లి మెగాస్టార్ సినిమాలో ఇరుక్కుపోయారు. అది అదిగో ఇదిగో అంటూ ఇప్పటికి స్టార్ట్ అయింది.
పోనీ ఇప్పటికయినా స్టార్ట్ అయింది అనుకుంటే, విడుదల డేట్ మళ్లీ ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తోంది. సమ్మర్ కు వస్తుందనుకున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 2కు వెళ్తుందని వార్తలు రావడమే ఇందుకు కారణం. ఆర్ ఆర్ ఆర్ సమ్మర్ కు రాదు అని కొన్ని నెలల క్రితమే గ్రేట్ ఆంధ్ర వెల్లడించిన సంగతి తెలిసిందే.
పోనీ చకచకా ఫినిష్ చేసి, సమ్మర్ టైమ్ లో తమ సినిమా విడుదల చేద్దాం అని కొరటాల అనుకున్నా కూడా ఆర్ఆర్ఆర్ నే అడ్డం పడుతోందని తెలుస్తోంది. ఎందుకంటే కొరటాల శివ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ దే కీలక పాత్ర. అందువల్ల ఆ సినిమా కన్నా ముందు ఈ సినిమా రావడం సాధ్యం కాకపోవచ్చు.
అందువల్ల కొరటాల-మెగాస్టార్ మూవీ సమ్మర్ కు రావడం కష్టం. మిగిలిన ఆప్షన్ మళ్లీ 2021 సంక్రాంతినే. అంటే దాదాపు భరత్ అనే నేనుతరువాత దగ్గర దగ్గర మూడేళ్ల పట్టినట్లు అన్నమాట కొరటాల శివ సినిమా స్క్రీన్ మీదకు రావడానికి. ఇదే కనుక ఆయన మెగా మూవీ పెట్టుకోకుండా వుంటే ఈ టైమ్ లో కనీసం రెండు సినిమాలు చేసి వుండేవారు.