Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆర్ఆర్ఆర్.. పులితో ఎన్టీఆర్ ఫైట్ లీక్

ఆర్ఆర్ఆర్.. పులితో ఎన్టీఆర్ ఫైట్ లీక్

ఆర్ఆర్ఆర్ యూనిట్ కు ఊహించని దెబ్బ తలిగింది. ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పై తీసిన పులి ఫైట్ వీడియో లీక్ అయింది. దీంతో యూనిట్ వెంటనే అప్రమత్తమైంది. కాపీరైట్ ఇష్యూ కింద సోషల్ మీడియాలో  పెట్టిన వీడియోస్ అన్నింటినీ డిలీట్ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

ఫేస్ బుక్, ట్విట్టర్ లోంచి వీడియోనైతే డిలీట్ చేయించారు కాబట్టి, వ్యక్తిగత మొబైల్స్ లోకి చేరిన వీడియోల్ని డిలీట్ చేయడం ఎవరి వల్ల కాదు. ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్ లో వైరల్ అవుతోంది. లక్షలకొద్దీ గ్రూపుల్లో షేర్ అవుతోంది. అలా విడుదలకు ముందే సినిమాలో అత్యంత కీలకమైన ఎన్టీఆర్-పులి ఫైట్ ను చాలామంది చూసేస్తున్నారు. వీడియోలో కొమరం భీమ్ పాత్రలో ఉన్న ఎన్టీఆర్ పరుగెడుతున్న స్టయిల్ బాగుందంటూ సోషల్ మీడియాలో అంతా కామెంట్స్ పెడుతున్నారు.

నిజానికి సినిమాలో ఇదే కీలకమైన ఫైట్. రామౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఫైట్. చాలా కష్టపడి తీసిన ఫైట్ కూడా. చివరికి ఈ ఫైట్ ను ప్రచారంలో కూడా వాడకూడదని, కేవలం సినిమాలోనే ఉంచాలని భావించాడు జక్కన్న. అలాంటిది ఇప్పుడిలా లీక్ అయి వైరల్ అయిపోయింది. ఎన్టీఆర్ ఇంట్రో లో భాగంగా ఈ ఫైట్ సీక్వెన్స్ వస్తుందట.

షూటింగ్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. ఇలా ఆర్ఆర్ఆర్ వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న అరకు షెడ్యూల్ లో ఓ వీడియో లీక్ అయింది. ఇప్పుడు ఏకంగా పులి ఫైట్ లీక్ అయింది. ఈసారి మరింత కట్టుదిట్టమైన చర్యల మధ్య షూటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నాన్ను ఒక్క డైరెక్టర్ చిన్న హీరో అన్నారు 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?