నాగ‌బాబూ… మీ బానిస‌త్వానికి స‌లాం!

మార్గ‌ద‌ర్శి అక్ర‌మాల కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న రామోజీరావుకు మ‌ద్ద‌తుగా ట్వీట్లు చేసిన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుపై నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. రామోజీపై వ్య‌క్తిగ‌త అభిమానం ఉండొచ్చ‌ని, కానీ ఆర్‌బీఐ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించి చిట్‌ఫండ్ వ్యాపారం…

మార్గ‌ద‌ర్శి అక్ర‌మాల కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న రామోజీరావుకు మ‌ద్ద‌తుగా ట్వీట్లు చేసిన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుపై నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. రామోజీపై వ్య‌క్తిగ‌త అభిమానం ఉండొచ్చ‌ని, కానీ ఆర్‌బీఐ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించి చిట్‌ఫండ్ వ్యాపారం చేయ‌డాన్ని స‌మ‌ర్థించ‌డంపై త‌ప్పు ప‌డుతున్నారు. రామోజీకి సంబంధించి నాగ‌బాబు చేసిన మూడు ట్వీట్ల‌న్నింటిని క‌లిపి ఏం ఉందో తెలుసుకుందాం.

“తెలుగు సినీ, మీడియా రంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకు వచ్చి, వ్యాపార రంగంలో వేలాది మందికి జీవనాధారం కల్పిస్తూ, కళారంగంలో “గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్”లో చోటు దక్కించుకొని ప్రపంచస్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన “పద్మ విభూషణ్” రామోజీ రావ్ గారు….లక్షలాది మందికి ఆదర్శం. ఆరు దశాబ్దాల ప్రస్థానంలో ఆయనకు ఎదురు కాని అవినీతి ఆరోపణలు వై.సీ.పీ అధికారంలోకి వచ్చాక పుట్టుకు రావడం విచారకరం. ఏడు పదుల వయసుపైబడిన రామోజీ రావ్ గారిని, ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం శోచనీయం. రామోజీ రావ్ గారిపై సామాజిక మాధ్యమాల్లో కావాలని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం”

నాగ‌బాబు అజ్ఞాన్ని ప్ర‌తిబింబించేలా ఈ ట్వీట్లు ఉన్నాయ‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. రామోజీపై వైఎస్సార్ హ‌యాంలో మార్గ‌ద‌ర్శి అవ‌క‌త‌వ‌క‌ల‌ వ్య‌వ‌హారాలు బ‌య‌టికొచ్చాయ‌ని విష‌యాన్ని నాగ‌బాబుకు తెలియ‌క‌పోవ‌డం ఆయ‌న నిలువెత్తు అవివేకానికి నిద‌ర్శ‌నంగా నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాగే మార్గ‌ద‌ర్శిపై మొట్ట‌మొద‌ట‌గా క‌ర్నాట‌క‌లో ఫిర్యాదు అందిన విష‌యాన్ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ చెప్పిన సంగ‌తిని గుర్తు చేస్తున్నారు.

రామోజీని నాగ‌బాబు ఆద‌ర్శంగా తీసుకుంటే అభ్యంత‌రం లేద‌ని, అలాగ‌ని అంద‌రూ ఆయ‌న్ను మ‌హానుభావుడిగా చూసి, నేరాల‌ను కూడా విస్మ‌రించాల‌ని కోరుకోవ‌డం ఏంటో అర్థం కావ‌డం లేద‌ని నెటిజ‌న్లు త‌ప్పు ప‌డుతున్నారు. నాగ‌బాబు ట్వీట్ల‌ను చూసిన త‌ర్వాత‌…  ప్చ్…. మీ బానిసత్వానికి సలాం నాగబాబూ అన‌కుండా వుండ‌లేక‌పోతున్నామ‌ని నెటిజ‌న్లు ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. నెటిజ‌న్స్ ఇంకా ఏమంటున్నారంటే…

“మీ అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చినప్పుడు  “జెండా పీకేద్దాం” అని  తాటికాయంత అక్షరాలతో హెడ్డింగులు పెట్టి వెక్కిరించాడు ఈ రామోజీ. చిరంజీవి మా కమ్మ రక్తం ఎక్కించుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు అని కండకావరంతో ఒక కమ్మ ప్రముఖుడు మీ అన్నయ్య ను హేళన చేశాడు. అప్పుడు మీరు ఖండించిన‌ట్టు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇప్పుడు రామోజీని వెన‌కేసుకు రావ‌డానికి భ‌య‌మా, భ‌క్తా ఏది కార‌ణ‌మో… క్లారిటీ ఇస్తే బాగుంటుంది నాగ‌బాబూ” అంటూ నెటిజ‌న్లు విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు.