‘ప్రెస్’ కార్డ్ వాడలేకపోతున్నారా?

అవసరమైన చోటల్లా ప్రెస్ కార్డ్ వాడేయడం అన్నది మీడియా జనాలకు అలవాటే. పోలీస్ ఆపితే ప్రెస్ అనడం, ఎక్కడన్నా ఎంట్రీ కావాలంటే ప్రెస్ అని చెప్పడం కామన్. ఇదంతా చిల్లర కొట్టుడు వ్యవహారం. ఈనాడు…

అవసరమైన చోటల్లా ప్రెస్ కార్డ్ వాడేయడం అన్నది మీడియా జనాలకు అలవాటే. పోలీస్ ఆపితే ప్రెస్ అనడం, ఎక్కడన్నా ఎంట్రీ కావాలంటే ప్రెస్ అని చెప్పడం కామన్. ఇదంతా చిల్లర కొట్టుడు వ్యవహారం. ఈనాడు రామోజీ రావు ది వేరే వ్యవహారం. మార్గదర్శి మీద దాడికి కూడా ప్రెస్ కార్డ్ వాడేస్తారు. 

వైఎస్ టైమ్ లో మార్గదర్శి మీద కేసు పడినపుడు ప్రెస్ కార్డును బలంగా వాడారు. వివిధ పార్టీలు, చోటా మోటా నాయకులు అందరి చేతా మీడియా మీద దాడి అంటూ హల్ చల్ చేయించారు. వివిధ వ్యవస్థల్లో ఆయనకు వున్న పట్టు కారణంగా కావచ్చు. మరెందువల్లైనా కావచ్చు ఆ కేసు అలా నీరుకారుతూ వస్తోంది. మొత్తానికి ప్రెస్ కార్డ్ బాగానే పనికి వచ్చింది.

ఇన్నాళ్లకు మళ్లీ ఈ వ్యవహారం మళ్లీ బయటకు వచ్చింది. గత నెల రోజులుగా మార్గదర్ళి వ్యవహారం నిగ్గు తేల్చడంలో ఆంధ్ర ప్రభుత్వం బలంగా పని చేస్తోంది. స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తోంది. బ్రాంచిల మీద సోదాలు, అరెస్ట్ లు, చార్టెడ్ అక్కౌంట్ సంస్థ మీద సోదా, అరెస్ట్ ఇలా పక్కాగా ఓ పద్దతిగా ముందుకు వెళ్తోంది. ఇప్పుడు ఫైనల్ గా రామోజీ కుటుంబం తలుపు తట్టింది.

వైఎస్ టైమ్ కు ఇప్పటికీ తేడా ఏమిటంటే..అప్పుడు ప్రెస్ కార్డ్ బలంగా వాడారు. ఇప్పుడు మరెందుకో వాడలేకపోతున్నారు. ఏ పార్టీ జనాలు కూడా కిక్కురు మనడం లేదు. ఒక్క తెలుగుదేశం అను ‘కుల’ మీడియా తప్ప. కొత్తగా జనసేన నాగబాబు గొంతెత్తారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడిని ఇలా చేస్తారా? అంటూ ఆ మాటకు వస్తే కింగ్ ఫిషర్ మాల్యా కూడా అంతకు మించి వేలాది మందికి ఉపాథి కల్పించారు. కానీ తప్పు తప్పే కదా? ఎవరు చేసినా? జగన్ కూడా సాక్షి, భారతి సిమెంట్స్ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించారు. మరి అలా అని జగన్ తప్పు చేస్తే అడగడం తప్పు అవుతుందా?

మార్గదర్శిలో ఏ తప్పులు లేకపోతే ప్రభుత్వం ఇంత దూకుడుగా ముందుకు వెళ్లదు. ఏ తప్పు లేకపోతే రామోజీ రావు కూడా ఊరుకోరు. మొత్తం తన పత్రికలో సవివరంగా వివరించి వుండేవారు. అలా చేయలేదు అంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఉండవల్లి కూడా ఈ పాయింట్ నే పట్టుకున్నారు. ఓ చిన్న పుస్తకం వేసేయచ్చుగా లేదా ఓ పేజీ లో అంతా వివరించవచ్చు కదా..అదీ కాకుంటె పోలీసులు ఏం అడిగారు చెప్పవచ్చు కదా అంటూ ప్రశ్నలు సంధించారు.

అయినా రామోజీ మిన్నకున్నారు. ఆయన కాగల కార్యం కోర్టుల ద్వారా సాధించుకోవాలని అనుకుంటున్నారు. అలా అయితే అసలు విషయాలు అన్నీ అలా వుండిపోతాయి. మొత్తం మీద ఈసారి మాత్రం ప్రెస్ కార్డ్ పనికిరావడం లేదో..లేదా వాడడం లేదో?