తెలుగుదేశం అను’కుల’మీడియా వ్యవహారం భలే చిత్రంగా వుంటుంది. తమ సామాజిక బంధాలతో తమ అను ‘కుల’ పోళ్లు ఏం చేసినా కమ్మగా వుంటుంది. వేరే వాళ్లు చేస్తే ..చీ యాక్ అంటూ ఈసడిస్తారు. ఇలాంటి మీడియా సంస్థ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఓ ఉత్సవంలో వేదిక మీద డ్యాన్సర్లతో సమానంగా తానూ డ్యాన్స్ చేసిన వీడియో అది. అందులో వల్గారిటీ ఏమీ లేదు. కాస్త హుషారుగా డ్యాన్స్ చేస్తున్నారంతే. అది తప్పట..సదరు మీడియాకు.
మరి పదిహేను నుంచి ఇరవై కోట్లు తీసుకుంటూ బాలయ్య చేస్తున్నది ఏమిటో? తన వయసులో సగం కన్నా తక్కువ వున్న అమ్మాయిలతో డ్యాన్స్ లు చేయడం లేదా? ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలుగా వుంటూ ఈ గెంతులు ఏమిటి? అసయ్యింగా అని ఎవరూ అనలేదు కదా.
బాలయ్య డబ్బులు తీసుకుని గెంతితే కళాపోషణ. ఉత్సవంలో జనాలతో కలిసి కాస్త గెంతులేస్తే అది దిగజారుడు? ఎక్కడి న్యాయం ఇది?
జనాల్లో వైకాపా ఎమ్మెల్సీని చులకన చేస్తున్నాం అని సంబర పడుతున్నారు కానీ జనం ఇది వరకు లా లేదు. మరి మీ ఎమ్మెల్యే బాలయ్య సంగతేమిటి? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అది గమనిస్తే ఇలాంటి ప్రచారాలు సాగించరు.