కోవిడ్ టైమ్ లో అమెజాన్ భారీ మొత్తానికి కొన్న తెలుగు సినిమా వి. ఆ సినిమాను ముఫై కోట్లకు పైగా మొత్తానికి కొన్నారని టాక్. అయితే అంతకు మించి వెచ్చించి కొన్న సినిమా ఆకాశం నీ హద్దురా.
సూర్య నటించిన ఈ సినిమా అన్ని భాషలకు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 42 కోట్లకు అమెజాన్ ప్రయిమ్ కొనుగోలు చేసినట్లు బోగట్టా.డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాలకు సోషల్ మీడియా పాజిటివ్ రెస్పాన్స్, వెబ్ సమీక్షలు వుంటాయి.
సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాకు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ పక్కగా కనిపిస్తోంది. అందువల్ల అమెజాన్ ప్రయిమ్ మెంబర్లకు ఫుల్ పైసా వసూల్ అనుకోవాలి.
కానీ ఈ సినిమా కారణంగా ప్రయిమ్ కు ఎంత మంది కొత్త సభ్యులు యాడ్ అవుతారు, ఎన్ని రెన్యూవల్స్ వుంటాయన్నది కీలకం. ఈ లెక్కలు అమెజాన్ నుంచి వెల్లడి కావు.
ఇదిలా వుంటే హీరో సూర్య నే ఈ సినిమాకు నిర్మాత. డిజిటల్ స్ట్రీమింగ్ కాకుండా ఆల్ లాంగ్వేజెస్ శాటిలైట్, హిందీ రీమేక్ ఇలాంటి ఇతర హక్కులు కూడా కొంత పే చేస్తాయి.
ఎలా లేదన్నా మొత్తం మార్కెట్ 65 నుంచి 70 కోట్ల వరకు వుంటుందని అంచనా. సినిమా నిర్మాణానానికి ఎంతయింది? హీరో తన సినిమాకు తన రెమ్యూనిరేషన్ ఎంత యాడ్ చేసుకున్నారు అన్నదాన్ని బట్టి సూర్య కంపెనీకి లాభం ఏ మేరకు అన్నది ఆధారపడి వుంటుంది.