టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని మాత్రమే అర్థం కాదు. దీనికి తెలుగు డ్రామా పార్టీ అనే అర్థం కూడా ఉంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే, చంద్రబాబు తన యూటర్న్ రాజకీయాలతో దీన్ని తెలుగు డ్రామా పార్టీగా మార్చేశారు. ఇప్పుడీ డ్రామా కంపెనీ నుంచి మరో కొత్త నాటకానికి తెరలేచింది. అది కూడా నంధ్యాల వేదికగా.
నంధ్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో జగన్ సర్కార్ సీరియస్ గా ఉంది. దుర్ఘటన జరిగిన వెంటనే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేసింది. సీఐని సస్పెండ్ చేయడంతో పాటు అతడిపై కేసు పెట్టి అరెస్ట్ చేసింది ప్రభుత్వం.
ఆ తర్వాత ఆ సీఐ బెయిల్ పై విడుదలయ్యారు. సరిగ్గా ఇక్కడే టీడీపీ తన మార్క్ పాలిటిక్స్ బయటకు తీసింది. వైసీపీనే ఆయనకు బెయిల్ ఇచ్చిందని ఆరోపణ చేసింది.
అయితే బాబు బండారాన్ని మంత్రి బొత్స సాక్ష్యాలతో సహా బయటపెట్టేసరికి టీడీపీ తోక ముడిచింది. స్వయంగా టీడీపీలో కార్యదర్శి స్థాయిలో ఉన్న రామచంద్రరావు అనే లాయర్, అరెస్టైన సీఐకి బెయిల్ ఇప్పించారు. ఈ విషయం బయటకు రావడంతో చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
రామచంద్రరావు ఇష్యూ బయటకు రాదని భావించిన చంద్రబాబు.. కొవ్వొత్తుల ర్యాలీ అంటూ సింపతీ పొందడానికి చూశారు. ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నించారు. ఎప్పుడైతే లాయర్ రామచంద్రరావు అసలు స్వరూపం బయటపడిందో వెంటనే తన డ్రామా స్టార్ట్ చేసింది టీడీపీ.
ఆఘమేఘాల మీద రామచంద్రరావును టీడీపీ కార్యదర్శి పదవి నుంచి తప్పించింది. తను సెక్రటరీ పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు రామచంద్రరావు.
చూశారుగా.. దొరికారు కాబట్టి డ్రామా మొదలుపెట్టారు. అదే దొరక్కపోతే.. ఈపాటికి బాబు జూమ్ ను వేడెక్కించేవారు. అతడి అనుకూల మీడియా రచ్చ రచ్చ చేసింది. బాబు రాజకీయాలు ఇలా ఉంటాయి. దొరికితే జుట్టు, దొరక్కపోతే కాళ్లు అన్నట్టు ఉంటుంది అతడి రాజకీయం.
తాజా ఘటనతో మైనార్టీలపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో మరోసారి అర్థమౌతుంది. అయినా తోకలు కత్తిరిస్తాను, జైళ్లో పెట్టిస్తానంటూ మైనార్టీలకు వార్నింగ్ లు ఇచ్చిన బాబుకు ఇంతకుమించి ఇంకేం ఆలోచనలు వస్తాయి చెప్పండి.