కొత్త ఏడాది ఆరంభంలో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అనిల్ రావిపూడి డైరక్షన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చింది. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అయితే కాస్త బాధపడే న్యూస్ ఏమిటంటే, మళ్లీ ఏడాదిన్నర వరకు మహేష్ సినిమా వుండకపోవచ్చు. వంశీ పైడిపల్లి డైరక్షన్లో దిల్ రాజు, పివిపి కలిసి నిర్మించే సినిమా 2021 సమ్మర్ కు కానీ విడుదల కాదు అని తెలుస్తోంది.
ఈ సినిమా జూన్ నుంచి కానీ సెట్ మీదకు వెళ్లదు అని తెలుస్తోంది. అందువల్ల సంక్రాంతికి రెడీ కాదు. నేరుగా 2021 సమ్మర్ విడుదల లక్ష్యంగానే పెట్టుకుని, ఈ సినిమా తయారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. పైగా ఇంకా మరో విషయం ఏమిటంటే ఈ సినిమాకు నిర్మాత కేవలం దిల్ రాజు మాత్రమేనా? పివిపి కూడా వుంటారా? అన్నది ఇంకా తేలాల్సి వుందని తెలుస్తోంది.
ఎందుకంటే వంశీ పైడిపల్లికి అడ్వాన్స్ పివిపి-దిల్ రాజు ఇద్దరూ కలిసి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో దిల్ రాజుకు పివిపి కి మధ్య మహర్షి లెక్కలు ఇంకా తేలలేదని, అవి తేలి, ఈ సినిమా నిర్మాణం పై కూడా ఆ ఇద్దరు ఓ క్లారిటీకి రావాల్సి వుంటుందని తెలుస్తోంది.
మొత్తం మీద ఏమయితేనేం వచ్చే ఏడాది సమ్మర్ వరకు మహేష్ ఫ్యాన్స్ వెయిటింగ్ లో వుండాల్సి వుంటుంది.