టాలీవుడ్లోకి రకరకాల జనాలు వస్తుంటారు. కొందరు వచ్చినపుడు ఓ హడావుడి వుంటుంది. ఆ మధ్య ఓ కొత్త సంస్థ వచ్చింది. దాంతో చిన్న ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో చిన్న సంచలనం. మరో భారీ సంస్థ ఎంట్రీ ఇస్తోంది. దాంతో ఇక బోలెడు కబుర్లు.. డిస్కషన్లు.
అయిదారు సినిమాలు ప్లానింగ్ అంట. అన్నీ పెద్ద సినిమాలే అంట. ఇండస్ట్రీతో చుట్టురికాలు వున్న వాళ్లు అంట.. మరో పెద్ద బ్యానర్ ఎంట్రీ ఇచ్చింది అంటూ. సరే ఓ సినిమా ఓపెనింగ్ అయితే అయింది. షూటింగ్ కు సన్నహాలు అయితే జరుగుతున్నాయి.
కానీ మరోపక్క ఆ సినిమాకు ఫైనాన్స్ కావాలంటూ కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అనే గుసగుసలు వినిపించడం ప్రారంభమైంది. అది కూడా ఒకరిద్దరు ఫైనాన్సియర్ ల దగ్గర నో అనే ఆన్సర్ వినిపించిందని, ఇప్పుడు మరొకరిని ట్రయ్ చేస్తున్నారని కూడా టాక్ పుట్టింది.
సరే, సినిమా ఎవరూ ఫైనాన్స్ తీసుకోకుండా చేయరు. పెద్ద పెద్ద సంస్థలు అయితే ప్రతి సినిమా కూడా ప్రాజెక్ట్ ఫండింగ్ అంటూ టోటల్ ఫైనాన్స్ తోనే స్టార్ట్ టు ఎండ్ చేస్తారు. కానీ అవన్నీ ఓ రేంజ్ కు ఎస్టాబ్లిష్ అయిన తరువాత. కానీ ఇలా క్లాప్ కొడుతూనే అలా ఫండింగ్ కు వెళ్తే, తీసుకోండి అంటూ ఇచ్చేవాళ్లు ఇక్కడ తక్కువ.
పైగా ఇంత పెద్ద సంస్థ.. అన్ని పెద్ద సినిమాలు అంటూ ఇన్ సైడ్ వర్గాల్లో హడావుడి జరిగిన తరువాత ఇలా ఫండింగ్ కోసం తిరుగుతుంటే, మళ్లీ అదే ఇండస్ట్రీ జనాలు రకరకాలుగా చెవులు కొరుక్కుంటున్నారు.