పరిటాల ఘాట్ సాక్షిగా తన భర్తకు ఇచ్చిన ఒకే ఒక్క మాటను నెరవేర్చలేకపోయానని మాజీ మంత్రి పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. పరిటాల రవి 15వ వర్ధంతి సందర్భంగా రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో పరిటాల ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి ఆమె నివాళులర్పించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తన భర్త చనిపోయినప్పటి నుంచి ఆయన ఆశయ సాధన కోసమే పని చేస్తున్నట్టు తెలిపారు.
గత ఏడాది ఇదే ఘాట్ వద్ద తన కుమారుడు శ్రీరామ్‌ను గెలిపించుకొస్తానని మాట ఇచ్చానన్నారు. కానీ ఆ ఒక్క మాట నెరవేర్చలేకపోయాననే బాధ తనను వెంటాడుతున్నట్టు ఆమె చెప్పారు. అమరావతి రైతుల ఆందోళనను పట్టించుకోకపోవడం ఏంటని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
టీడీపీ కష్టకాలంలో పోతుల సునీత పార్టీని వీడటం ఏం బాగాలేదన్నారు. పరిటాల రవి హత్యానంతరం తన కుటుంబ సభ్యులతో పాటు పోతుల సురేష్ కుటుంబాన్ని కూడా చంద్రబాబు ఆదరించారన్నారు. చంద్రబాబు చేసిన మేలును మరిచిపోయి పోతుల కుటుంబం పార్టీ వీడిందని ఆమె వాపోయారు. కాగా రాప్తాడు నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పరిటాల సునీత పోటీ చేయకుండా తన కుమారుడు శ్రీరామ్‌ను నిలిపారు. జగన్ సునామీలో రాప్తాడు నుంచి వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఘన విజయం సాధించారు.
ఈ పప్పు నాయుడి గాడికి రాజకీయా బిక్ష పెట్టిందే రాజశేఖర్ రెడ్డి గారు