మైనార్టీల విషయంలో బాబుకీ, జగన్ కీ అదే తేడా

వాడుకుని వదిలేయడమనేది చంద్రబాబు నరనరానా జీర్ణించుకున్న విద్య. మూడు రాజధానుల బిల్లుని అప్రజాస్వామికంగా అడ్డుకోడానికి ఆయన మైనార్టీ నాయకుడు, మండలి చైర్మన్ షరీఫ్ ని వాడుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకున్న ద్రోహిగా ఆయన్ని చిత్రీకరించాలని…

వాడుకుని వదిలేయడమనేది చంద్రబాబు నరనరానా జీర్ణించుకున్న విద్య. మూడు రాజధానుల బిల్లుని అప్రజాస్వామికంగా అడ్డుకోడానికి ఆయన మైనార్టీ నాయకుడు, మండలి చైర్మన్ షరీఫ్ ని వాడుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకున్న ద్రోహిగా ఆయన్ని చిత్రీకరించాలని చూశారు. చివరకు ఆయనపై మంత్రులు దాడి చేశారని, దూషించారని కూడా ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూశారు. మైనార్టీలకు వైసీపీ వ్యతిరేకం అనే దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. 

అయితే అది చంద్రబాబుకే రివర్స్ తగిలింది. సాక్షాత్తూ షరీఫే.. తనని ఎవరూ ఇబ్బంది పెట్టలేదని, దూషించలేదని చెప్పిన తర్వాత చంద్రబాబు ఎంత దిగజారిపోయాడో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మైనార్టీ నాయకుడిని పావుగా వాడుకుని మండలిలో బిల్లుని అడ్డుకున్న చంద్రబాబు, మైనార్టీలపై మచ్చపడేలా చేశారని ఆ వర్గం ఆగ్రహంతో ఉంది. 

అదే సమయంలో అసెంబ్లీలో మండలి రద్దు ప్రతిపాదనలు చేసిన మంత్రులు ఏ దశలోనూ షరీఫ్ పై మాట తూలలేదు. కేవలం చంద్రబాబ డైరక్షన్ వల్లే, టీడీపీకి విధేయుడు కావడం వల్లే ఆయన బిల్లుని సెలక్ట్ కమిటీకి పంపించారని చెప్పారు. చంద్రబాబు రాంగ్ డైరక్షన్లో షరీఫ్ పనిచేశారని అన్నారు. తాను తప్పు చేస్తున్నానని ఒప్పుకుంటూనే బిల్లుని సెలక్ట్ కమిటీకి పంపానని చైర్మన్ చెప్పడం ఆయన నిస్సహాయతను తెలియజేస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను మాత్రం ఆయన మరచిపోయారు. దీంతో ఒకరకంగా రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి ఆయన గురయ్యారు. 

అయితే ఈ ఎపిసోడ్ మొత్తంలో చంద్రబాబు ప్రవర్తన, జగన్ ప్రవర్తన ఎలా ఉందనే విషయం మరోసారి రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మైనార్టీలకు బాగా అర్థమైంది. మైనార్టీలను అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని, వాళ్లని పావులుగా వాడుకోవాలన్న దుర్భుద్ధి చంద్రబాబుది. తప్పు జరిగిందని తెలిసినా, మూలకారకుడు చంద్రబాబుని మాత్రమే విమర్శించి, మైనార్టీ నాయకుడిని పల్లెత్తు మాట అనని సంస్కారం జగన్ ది.

వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి

ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?