మోత మొదలైంది.. మళ్లీ పెరగనున్న ఫోన్ బిల్లు

కార్పొరేట్లు కలిస్తే దేశానికి ఎంత నష్టమో.. గుప్తాధిపత్యం వస్తే ప్రజలు ఎంత నష్టపోతారో ఇప్పుడిప్పుడే మొబైల్ వినియోగదారులకు అవగతం అవుతోంది. మొన్నటివరకు తక్కువ టారిఫ్ లు ఎంజాయ్ చేసిన కస్టమర్లు.. ఇప్పుడు బ్యాక్ టు…

కార్పొరేట్లు కలిస్తే దేశానికి ఎంత నష్టమో.. గుప్తాధిపత్యం వస్తే ప్రజలు ఎంత నష్టపోతారో ఇప్పుడిప్పుడే మొబైల్ వినియోగదారులకు అవగతం అవుతోంది. మొన్నటివరకు తక్కువ టారిఫ్ లు ఎంజాయ్ చేసిన కస్టమర్లు.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చార్జీల మోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. టారిఫ్ లు పెంచి 3 నెలలైనా కాకముందే, మరోసారి మొబైల్ కంపెనీలన్నీ చార్జీల మోతకు సిద్ధమయ్యాయి. 

మొన్నటికిమొన్న దాదాపు 16 నుంచి 35 శాతం వరకు చార్జీలు పెరిగాయి. డేటా ప్యాక్స్ లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ… మినిమం రీచార్జ్ ఎమౌంట్స్ పెంచడంతో పాటు, ఓవరాల్ గా అన్ని ప్యాక్స్ రేట్లు పెంచాయి మొబైల్ కంపెనీలు. ఇప్పుడు అవే చార్జీల్ని మరో 30శాతం పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈసారి కంపెనీలన్నీ మూకుమ్మడిగా చెబుతున్న పేరు ఏజీఆర్. ఏజీఆర్ అంటే ఎడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. 

ప్రస్తుత మొబైల్ కంపెనీలన్నీ చెబుతున్నది ఏంటంటే.. వినియోగదారుడి నుంచి మొబైల్ కంపెనీలకు వచ్చే సగడు ఆదాయం ఇప్పుడు పూర్తిగా పడిపోయిందట. జియో రాకముందు వచ్చే ఆదాయంతో పోలిస్తే, ఇప్పుడు చాలా తక్కువగా కస్టమర్ నుంచి డబ్బులు వస్తున్నాయట. చైనా, జపాన్,  ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాలతో పోలిస్తే, భారతీయ వినియోగదారుడు టెలికంపై చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాడట.

గడిచిన మూడేళ్ల నుంచి పరిస్థితి ఇలానే ఉండడంతో ఈసారి చార్జీలు 30శాతం పెంచేలా ఆలోచిస్తున్నారు. అంటే.. జియో రాకముందు కాల్ చార్జీలు, ప్యాక్ చార్జీలు ఎలా ఉండేవో దాదాపు ఆ స్థాయికి ఇప్పుడు మళ్లీ మొబైల్ చార్జీలు వెళ్తాయన్నమాట. ఈ విషయంలో ఈసారి జియోను చూసి మిగతా కంపెనీలు భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే జియో ఆల్రెడీ రేట్లు పెంచేసింది. అదనంగా కాల్ చార్జీలు (జియో నుంచి ఇతర నెట్ వర్క్ కు) కూడా పెట్టేసింది. ఇప్పుడు మరోసారి రేట్ల సవరింపుకు సై అంటోంది. కాబట్టి ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది.

నువ్వు అనుకుంటే అవుతుంది సామి..మీ మాట ఒక శాసనం

వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి