ఉత్తరాంధ్ర ఉత్తమ విలన్ …!

ఉత్తరాంధ్ర అత్యంత వెనకబడిన ప్రాంతం. ఇక్కడ జిల్లా కేంద్రాలు సైతం పల్లెటూర్లను తలపిస్తాయి. నూటికి తొంబైశాతం జనం అత్యంత పేదలు, బడుగులు, బీసీలు, వారు తమ బతుకు తెరువు కోసం  వేరే ప్రాంతాలకు వలసలకు…

ఉత్తరాంధ్ర అత్యంత వెనకబడిన ప్రాంతం. ఇక్కడ జిల్లా కేంద్రాలు సైతం పల్లెటూర్లను తలపిస్తాయి. నూటికి తొంబైశాతం జనం అత్యంత పేదలు, బడుగులు, బీసీలు, వారు తమ బతుకు తెరువు కోసం  వేరే ప్రాంతాలకు వలసలకు పోతూంటే ఇతర జిల్లాల నుంచి బతుకుతెరువు కోసం ఇక్కడకు  వచ్చిన వారు  రాజకీయ ఉపాధి చూసుకున్నారు.

కధ అంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడ ఉంటూ, తింటూ తమ సొంత ప్రాంతాలకు సరైన  సమయాల్లో జై కొట్టడమే ఉత్తరాంధ్రా జనానికి మంట పుట్టిస్తోంది. దాంతో వారు శివాలెత్తిపోతున్నారు.

కేవలం సారాయి వ్యాపారంతో కోట్లకు పడగలెత్తిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు జనాలకు పెద్దగా  ఏం చేయకపోయినా టీడీపీ జెండాను అభిమానించేవారు గుండెల్లో పెట్టుకున్నారు. వారంతా బీసీలు, పేదలే.

మరి వరసగా మూడు మార్లు నెగ్గడానికి వెలగపూడికి ఈ జనం ఇచ్చిన మద్దతే కారణం. ఇప్పటికి రెండు తడవలు ప్రతిపక్షం, ఒకసారి అధికార పక్షంలో ఉన్న వెలగపూడి నిఖార్సుగా ఇదీ  తన ప్రాంతానికి చేసిన పని అని చెప్పుకోలేకపోయినా జనం టీడీపీ జెండా ఎత్తారు.

కానీ ఆయన విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తూ  అమరావతికి జై అండడంతోనే వారికి  చిర్రెత్తుకొచ్చించి. అందుకే తూర్పు ఎరుపెక్కింది. వరసగా కొన్ని రోజులుగా వెలగపూడి ఇల్లు ముట్టడించే కార్యక్రమం చేపడుతున్నారు, దిష్టి బొమ్మలను తగులబెడుతున్నారు.

మా ఓట్లు తీసుకుని మాకు అన్యాయం చేయడం తగునా అంటూ గట్టిగానే విమర్శిస్తున్నారు. వైసీపీ ఆద్వర్యంలో  జరుగుతున్న ఆందోళలనలతో తూర్పు టీడీపీ కంచుకోటక బీటలు వారుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి.

ఉత్తరాంధ్రా నుంచి టీడీపీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అందరికంటే దూకుడుగా అమరావతికి జై అంటున్న వెలగపూడి ఉత్తమ విలన్ అయిపోయారు. ఇలాంటి వారంతా ఆలోచన చేయాలని మేధావులు, ప్రజాసంఘాలు కోరుతున్నారు, లేకపోతే అమరావతికే పంపిస్తామని గర్జిస్తున్నారు.

ఈ పప్పు నాయుడి గాడికి రాజకీయా బిక్ష పెట్టిందే రాజశేఖర్ రెడ్డి గారు

ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?