శ్రేయ కీలకపాత్రలో, అయిదు భారతీయ భాషల్లో తయారవుతున్న సినిమా గమనం. ఈ సినిమా ట్రయిలర్ ను అయిదు భాషల్లో అయిదుగురు ప్రముఖ హీరోలు ఆన్ లైన్ లో విడుదల చేసారు. గతంలో వేదం తదితర సినిమాల మాదిరిగానే మూడు కథల సమహారం గమనం. ట్రయిలర్ కూడా ఆ విషయమే స్పష్టం చేస్తోంది.
స్లమ్ లో వుండే గృహిణిగా శ్రియ కనిపిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి. పైగా మూగ. ఇదీ శ్రియ పాత్ర ప్రత్యేకత. దుబాయ్ కు ఉద్యోగానికి వెళ్లిన భర్త కోసం ఆమె ఎదురుచూపులు.
అలాగే శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ లు ఓ జంటగా వారిదో కథగా వుంది. మాంచి క్రికెటర్ కావాలన్న కోరిక శివ కందుకూరిది. ఇద్దరు అనాధ రోడ్ కిడ్స్ కథ మరోటి. బర్త్ డే ను చేసుకోవాలనే కోరిక వారిది.
ఇలాంటి వారి జీవితాలను నగరానికి వచ్చిన వరదలు కలిపాయా? మరింత అతలాకుతలం చేసాయా? అన్నది కథలో కీలకం అని ట్రయిలర్ చెబుతోంది. సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ఫ్లడ్ సీన్లు ట్రయిలర్ లో రియలిస్టిక్ గా వున్నాయి.
అయితే గొలుసుకట్టు కథలు, ఆ సీన్లు, ఆ డైలాగులు ఇప్పటికే ఇలాంటి లైన్ లో రెండు మూడు సినిమాలు వచ్చేయడంతో ట్రయిలర్ చూసేవాళ్ల ఆలోచనలను అటు డైవర్ట్ చేసేలా వున్నాయి. ఇళయరాజా నేపథ్య సంగీతం బాగుంది. గమనం సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సుజనరావు, మాటలు బుర్ర సాయి మాధవ్,