పెదవులకు లిప్ స్టిక్, కళ్లకు మస్కారా, ముఖానికి మేకప్.. ఇలా అందాన్ని పెంచుకోవడానికి అమ్మాయిలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మాస్క్ పెట్టుకోవడం మొదలైన తర్వాత వీళ్లంతా చాలా బాధపడ్డారు. మాస్క్ మాటును తమ అందాన్ని నలుగురికి చూపించడం కుదరడం లేదని వాపోతున్నారు. ఇలాంటి వాళ్లందరికీ గుడ్ న్యూస్ మోసుకొచ్చింది బ్రిటన్ లోని ఓ యూనివర్సిటీ.
ముఖానికి మాస్క్ వేసుకుంటే అందం మరింత పెరుగుతుందనేది ఈ యూనివర్సిటీ వాదన. యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ డిపార్ట్ మెంట్ ఈ మేరకు ఓ సర్వే నిర్వహించింది. చిన్నపాటి అధ్యయనం కూడా చేసింది. దీని ఆధారంగా వీళ్లు నిర్థారించిన అంశం ఏంటంటే.. అమ్మాయిలు మాస్క్ పెట్టుకుంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారట. ఇక నీలం రంగు మాస్క్ పెట్టుకుంటే, అందం డబుల్ అవుతుందనేది వీళ్ల మాట.
మాస్కులు వేసుకొని మహిళల ముఖాల కంటే, మాస్క్ వేసుకున్న మహిళల ముఖాన్ని పురుషులు ఎక్కువ సేపు చూస్తున్నారట. మాస్కులు వేసుకున్న మహిళల కళ్లు మగాళ్లను కట్టిపడేస్తున్నాయని ఈ యూనివర్సిటీ తేల్చిచెప్పింది.
సో.. తమ అందానికి మాస్క్ అడ్డంగా ఉందని అమ్మాయిలు ఇక ఎంతమాత్రం ఆందోళన చెందనవసరం లేదు. కళ్లను మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంచేలా బ్యూటీ టిప్స్ ఫాలో అయితే సరిపోతుందని శెలవిస్తున్నారు. పెదవులకు లిప్ స్టిక్ పూసుకున్నారా లేదా అనేది బ్యూటీ వరల్డ్ లో ఇప్పుడు అసలు మేటర్ కాదంటున్నారు వీళ్లు.