క‌ర్ణాట‌క ఎన్నిక‌లు.. కేసీఆర్ పార్టీ నోరు మెద‌ప‌దే!

క‌ర్ణాట‌క‌లో 20-30 సీట్ల‌ను అల‌వోక‌గా గెలిచేస్తామంటూ ఆ మ‌ధ్య గులాబీ చొక్కాలు చాలా ఇదైపోయాయి! త‌న పార్టీని కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. దేశంలో తాము ఎక్క‌డెక్క‌డ గెలిచేయ‌గ‌ల‌మో కారు పార్టీ…

క‌ర్ణాట‌క‌లో 20-30 సీట్ల‌ను అల‌వోక‌గా గెలిచేస్తామంటూ ఆ మ‌ధ్య గులాబీ చొక్కాలు చాలా ఇదైపోయాయి! త‌న పార్టీని కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. దేశంలో తాము ఎక్క‌డెక్క‌డ గెలిచేయ‌గ‌ల‌మో కారు పార్టీ వాళ్లు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు! టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన త‌ర్వాత వారు స్పందిస్తూ.. క‌ర్ణాట‌క‌లో ఇర‌వై ముప్పై సీట్ల‌లో టీఆర్ఎస్ ప్ర‌భావం ఉంటుందంటూ ఎంతో విశ్వాసంగా వాదించారు! తెలుగు మాట్లాడే ప్రాంత‌మంతా త‌మ‌దే హ‌వా అనేంత రేంజ్ లో వీరు రెచ్చిపోయారు!

హైద‌రాబాద్ క‌ర్ణాట‌క‌- బెంగ‌ళూరులోని కొన్ని స్థానాల్లో కేసీఆర్ త‌న అభ్య‌ర్థుల‌ను పోటీ పెట్ట‌డ‌మే ఆల‌స్యం అనేంత రేంజ్ లో వీరి హ‌డావుడి సాగింది. అయినా ఇప్పుడు వీరిని క‌ర్ణాట‌క‌లో బ‌లం నిరూపించుకోమ‌ని కూడా ఎవ్వ‌రూ చెప్ప‌లేదు. అయితే త‌మ‌ది జాతీయ పార్టీ అని చెప్ప‌డానికి క‌ర్ణాట‌క పేరును వాడుకున్నారు!

క‌ట్ చేస్తే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల సంగ్రామం జ‌రుగుతూ ఉంది. ప్ర‌దాన పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ ఉన్నాయి. మ‌రి బీఆర్ఎస్ మాత్రం చ‌డీచ‌ప్పుడు చేయ‌డం లేదు. ఇర‌వై- ముప్పై సీట్ల‌ను మంచినీళ్ల ప్రాయంగా గెలిచేస్తామ‌న్న వాళ్లు కాస్తా.. ఇప్పుడు గ‌ప్ చుప్ గా ఉన్నారు.

త‌మ పార్టీ త‌ర‌ఫున స‌ద‌రు ఇర‌వై ముప్పై సీట్ల‌లో ఎవ‌రు నిలుస్తున్నారో చెప్ప‌డం లేదు. కేసీఆర్ కూడా క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఎదుర్కొన‌డానికి ఎలా ప్రిపేర్ అవుతున్నారో వీళ్లు చెప్ప‌డం లేదు. మ‌రి క‌ర్ణాట‌క‌లో బీఆర్ఎస్ కు మిత్ర‌ప‌క్షం జేడీఎస్ కూడా వీరి మ‌ద్ద‌తు కోరుతూ పిలుపును ఏదీ ఇవ్వ‌డం లేదు! బ‌హుశా తాము ఈ సారికి జేడీఎస్ కు మ‌ద్ద‌తును ఇచ్చేసిన‌ట్టుగా ప్ర‌క‌టించేసి.. చేతులు దులుపుకుంటారేమో! మ‌రి జాతీయ పార్టీ అంటూ అంత హ‌డావుడి చేసి ప‌క్క రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌స్తే స‌త్తా చాట‌డానికి ముందుకు వెళ్ల‌క‌పోతే ఎలాగ‌బ్బా!