శ్రీకాంత్ ఓదెలకు 80 లక్షల బి ఎమ్ డబ్ల్యు

దసరా సినిమా పెద్ద హిట్ అయింది. నిర్మాత చెరుకూరి సుధాకర్ మామూలు హ్యాపీ కాదు. ఫుల్ హ్యాపీ. పడి పడి లేచె మనసు, విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు తీసారు. కానీ మంచి…

దసరా సినిమా పెద్ద హిట్ అయింది. నిర్మాత చెరుకూరి సుధాకర్ మామూలు హ్యాపీ కాదు. ఫుల్ హ్యాపీ. పడి పడి లేచె మనసు, విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు తీసారు. కానీ మంచి ఫలితం అందుకోలేకపోయారు. మంచి నిర్మాత. మంచి వాడు హిట్ రావాలి. హిట్ పడాలి అని ఇండస్ట్రీలో అంతా అనుకున్నారు. బహుశా వాటి ఫలితమేమో దసరా సినిమా మంచి హిట్ అయింది. 

నిర్మాతకు మిగిలిందా? కాస్త తగిలిందా? అన్నది పక్కన పెడితే తరువాత సినిమా అదే బ్యానర్ లో చేస్తారు డైరక్టర్ అనే మాట వినిపించింది. ఇప్పుడు దాన్ని దృఢం చేసుకునేందుకు కావచ్చు, తమ బ్యానర్ కు మంచి సినిమా ఇచ్చాడని కావచ్చు, నిర్మాత సుధాకర్ ఓ భారీ గిప్ఠ్ ను దర్శకుడు శ్రీకాంత్ కు ఇవ్వబోతున్నారు.

బి ఎమ్ డబ్ల్యు కారును బుక్ చేసారు. ఒకటి రెండు రోజుల్లో డెలివరీ తీసుకుని డైరక్టర్ కు ఇవ్వబోతున్నారు. నిజానికి దసరా సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు ముందుగా అమ్మేసారు కానీ లేదూ అంటే నిర్మాతకు ఒక్క నైజాం మీద కనీసం ఏడెనిమిది  కోట్లు ఓవర్ ఫ్లోస్ వచ్చి వుండేవి. సరే అదంతా వేరే సంగతి. మొత్తానికి ఓ హిట్ అన్నది హిట్ నే. అది ఇచ్చే ఊపు వేరు. ఈ ఊపున మరో భారీ సినిమాకు శ్రీకారం చుట్టాలన్నది సుధాకర్ ప్లాన్.

అందుకే డైరక్టర్ శ్రీకాంత్ ను తన బ్యానర్ లోనే వుంచుకోవాలనుకుంటున్నారు. దసరా సినిమా నిర్మాణంలో వుండగానే కొన్ని పెద్ద బ్యానర్లు శ్రీకాంత్ కు అడ్వాన్స్ ఇచ్చి, రెండో సినిమాకు సెట్ చేసుకుందాం అని చూసారు కానీ వర్కవుట్ కాలేదు.