మీ ఇంటిగుట్టు ఏంటి? క‌ర‌క‌ట్ట నుంచి కేతిరెడ్డి!

పాద‌యాత్ర‌లో భాగంగా ధ‌ర్మ‌వ‌రం మీదుగా వెళ్తూ అక్క‌డి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి ఫామ్ హౌస్ ను ఆక్ర‌మించి క‌ట్టారంటూ విమ‌ర్శ‌లు చేసిన తెలుగుదేశం నేత నారా లోకేష్ కు స‌ద‌రు ఎమ్మెల్యే గ‌ట్టిగా కౌంట‌ర్…

పాద‌యాత్ర‌లో భాగంగా ధ‌ర్మ‌వ‌రం మీదుగా వెళ్తూ అక్క‌డి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి ఫామ్ హౌస్ ను ఆక్ర‌మించి క‌ట్టారంటూ విమ‌ర్శ‌లు చేసిన తెలుగుదేశం నేత నారా లోకేష్ కు స‌ద‌రు ఎమ్మెల్యే గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు. త‌న‌కు ఫామ్ హౌస్ ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని, దాన్ని త‌ను ఎలా క‌ట్టిందీ ఇప్ప‌టికే ప‌లు సార్లు యూట్యూబ్ లో వీడియోల ద్వారానే వివ‌రించిన‌ట్టుగా కేతిరెడ్డి చెప్పారు. 

ఇది వ‌ర‌కూ ఇలాంటి మాట‌లు వినిపించిన‌ప్పుడు త‌ను అందుకు వివ‌ర‌ణ ఇచ్చి, త‌ను రైతుల నుంచి భూములు కొనే ఆ ఫామ్ హౌస్ ను కొన్న‌ట్టుగా పూర్తి వివ‌రాల‌ను ఇచ్చిన‌ట్టుగా, అయినా లోకేష్ ఇంగితం లేకుండా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్న‌ట్టుగా కేతిరెడ్డి విరుచుకుప‌డ్డారు.

న‌డిరోడ్డుపై పిచ్చికుక్క త‌ర‌హాలో లోకేష్ శైలి ఉంద‌ని, ఎవ‌రో ఏదో రాసిస్తే దాన్ని య‌థాత‌థంగా చ‌దువుతున్నారంటూ కేతిరెడ్డి తీవ్రంగా స్పందించారు. విష‌య‌ప‌రిజ్ఞానం లేని వ్య‌క్తి అంటూ లోకేష్ పై కేతిరెడ్డి విమ‌ర్శ‌లు సందించారు.

అయితే ఈ కౌంట‌ర్ అంతా కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి క‌ర‌క‌ట్ట మీద నుంచి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట పై చంద్ర‌బాబు నివాసానికి కూత‌వేటు దూరంలో నిల‌బ‌డి కేతిరెడ్డి వీడియో చేశారు. త‌ను రైతుల నుంచి అధికారికంగా భూములు కొనుగోలు చేసి, చ‌ట్ట‌ప్ర‌కారం ఫామ్ హౌస్ నిర్మించుకుంటే దాన్ని వివాదం చేస్తున్నార‌ని.. మ‌రి కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట‌పై క‌ట్టిన అక్ర‌మ నిర్మాణంలో చంద్ర‌బాబు ఎలా ఉంటున్నార‌ని, ఇంత‌కీ అదెవ‌రిది అని కేతిరెడ్డి ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబుకు ఆ ఇల్లు లింగ‌మ‌నేని నుంచి ఎలా వ‌చ్చింద‌ని, దానికి లింగ‌మ‌నేనికి చంద్ర‌బాబు చేసిన ప్ర‌తిఫ‌లం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. కృష్ణాన‌దికి భారీ ఎత్తున వ‌ర‌ద‌లు వ‌స్తే పంట‌చేల‌కూ, ఊర్ల‌కు ర‌క్ష‌ణగా వ‌దిలిన క‌ర‌క‌ట్ట‌పై నిర్మించిన ఇంటిలో చంద్ర‌బాబు ఎలా నివసిస్తున్నార‌ని.. ఇదే ర‌కంగా రైటో చెప్పాల‌ని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. 

త‌న ఫామ్ హౌస్ క‌ట్ట‌డానికి సంబంధించి భూముల కొనుగోలుకు ఆధారాలు త‌ను చూపిన‌ట్టుగా, చంద్ర‌బాబు -లోకేష్ లు ఇలాంటివేమైనా చూప‌గ‌ల‌రా? అన్న‌ట్టుగా కేతిరెడ్డి ప్ర‌శ్నించారు, మ‌రి ధ‌ర్మ‌వ‌రం చెరువు క‌ట్ట‌కు ఆనుకుని ఉన్న భూముల్లో త‌న ఫామ్ హౌస్ నిర్మాణానికి త‌ను భూములు కొనుగోలు చేసిన దాఖ‌లాలు కూడా చూపిస్తున్న కేతిరెడ్డికి లోకేష్- చంద్ర‌బాబులు త‌మ ఇంటి గుట్టు ఏమిటో చెప్ప‌గ‌ల‌రా?