కుర్రాళ్ళూ.. గుర్రాలూ.. పందేలు…

రాజులూ రాజ్యాలు పోయాయి. కానీ వారు వాడే వాహనాలు మాత్రం కళ్ళెదుటే ఉన్నాయి. గుర్రం ఎక్కడం అంటే భలే సరదా. దాన్ని స్వారీ చేయడం అంటే ఎవరికైనా ఎక్కడలేని హుషార్ వచ్చేస్తుంది. Advertisement విశాఖ…

రాజులూ రాజ్యాలు పోయాయి. కానీ వారు వాడే వాహనాలు మాత్రం కళ్ళెదుటే ఉన్నాయి. గుర్రం ఎక్కడం అంటే భలే సరదా. దాన్ని స్వారీ చేయడం అంటే ఎవరికైనా ఎక్కడలేని హుషార్ వచ్చేస్తుంది.

విశాఖ బీచ్ లో ఇలా గుర్రాలను ముందు పెట్టి వాటి మీద కాసేపు ఊరేగే చాన్స్ సందర్శకులకు ఇస్తూంటారు. . అలా కొద్ది క్షణాలు అయినా తాము కింగులమన్న ఫీలింగ్ ఎక్కే వారిలో కలుగుతుంది. ఇది భలే బిజినెస్ కూడా

మరో వైపు చూసుకుంటే గుర్రాలతో పందేలకు కూడా విశాఖ జిల్లాలో తెర తీశారు. సంక్రాంతి పెద్ద పండుగ. అన్నీ వినోదాలే. ఎక్కడా అభ్యంతరాలు అవాంతరాలు లేని ఫెస్టివల్ ఇది. దాంతో  అనకాపల్లిలోని మునగపాకలో పెద్ద ఎత్తున గుర్రం పందేలు నిర్వహించారు. మొత్తం పదహారు గుర్రాలు ఈ పందేలలో పాల్గొంటే వాటి మీద స్వారీ చేస్తూ పందెం రాయుళ్ళు తెగ జోరు చేశారు.

వీటికి ప్రధమ, ద్వితీయ బహుమతులు ఇచ్చారు. ఈ గుర్రం పందేలను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనాలు కూడా రావడం విశేషం. ఇది సంక్రాంతి సంప్రదాయమని, ప్రతీ ఏటా పెద్ద ఎత్తున వీటిని  నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తానికి కోడి పందేలతో మొదలై గుర్రం పందేలతో సంక్రాంతి సంబరాలు ముగిసాయన్న మాట.