ఒకవైపు సినిమాలు చేస్తూ మరొకవైపు బుల్లితెర స్క్రీన్ పై అలరిస్తూ మంచి పాపులారిటీ దక్కించుకున్న యాంకర్ అనసూయ తాజాగా తన కేరిర్ కు సంబంధించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ముఖ్యంగా ఆంటీ అంటే ఎందుకు కోపమని అడిగిన నెటిజన్ కు ఆసక్తికర అంశాలను వెల్లడించింది.
సోషల్ మీడియా వేదికగా అనసూయ ఆంటీ వివాదంపై సమాధానం చెప్పుతూ.. “ఆంటీ అని సంబోధించే వాళ్ళ అర్థాలు వేరు ఉంటాయి. అయితే ఇప్పుడు మాత్రం కోపం రావడం లేదు. అది వాళ్ళ ఖర్మకే వదిలేస్తున్నా. వాటిని పట్టించుకోవడం లేదని… ఇక నుంచి టీవీ షోలు, ప్రకటనలు, సినిమాల కన్నా కుటుంబానికే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాధానం చెప్పింది.
కాగా కొన్ని రోజుల క్రితం అనసూయని ఆంటీ అన్నారని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. ఆంటీ అన్నారని పోలీసు కేసు కూడా పెట్టింది. దీంతో మరింత రెచ్చిపోయిన ట్రోలర్స్ కొన్ని రోజులు పాటు ఆంటీ అనే పదం ట్విట్టర్ లో ట్రెండింగ్ చేశారు. అప్పటి నుండి సైలెంట్ గా ఉన్న ఆంటీ వివాదం మరోసారి వార్తలోకి వచ్చింది.