లాయర్ కొడుకు లాయర్…డాక్టర్ కొడుకు డాక్టర్ అన్నట్లుగా డైరక్టర్ కొడుకు డైరక్టర్ కావడం మంచిదే. కెఎస్ ప్రకాశరావు కొడుకు రాఘవేంద్ర రావు డైరక్టర్ అయ్యారు. కానీ ఆయన కొడుకు కాలేదు.
ప్రస్తుతం టాలీవుడ్ లో వున్న దర్శకుల పిల్లలు డైరక్టర్లు కావడానికి ఇంకా చాలా అంటే చాలా కాలం పడుతుంది. ఎందుకంటే ఇంకా అంతా ఎల్కేజీ, యూకేజీలే. కానీ త్రివిక్రమ్ సంగతి వేరు. చాలా కాలం కిందటే పెళ్లయిపోయింది. ఆయన సతీమణి చెప్పిన మాట ప్రకారం చాలా ఎర్లీ ఏజ్ లో పెళ్లయింది. కొడుకులు ఇద్దరిలో ఒకరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. అంటే మరో రెండు మూడేళ్లలో రెడీ అన్నమాట.
‘తన కొడుకుల్లో ఒకరికి డైరక్షన్ అంటే బాగా ఇష్టం అని, సీన్ చూసి, ఏ కెమేరా, ఏ లెన్స్ వాడారు అన్నది చకచకా చెప్పేస్తాడని’ అంటున్నారు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య. డైరక్షన్ ఇంట్రస్ట్ వుందని కూడా వెల్లడించేసారు. ఇంకేముంది..తండ్రి అండతో డైరక్టర్ గా మారడం మాత్రమే తరువాయి. అన్ని విధాలా గైడెన్స్ ఇవ్వడానికి ఏస్ డైరక్టర్ ఇంట్లో వున్నారు. కథ, స్క్రీన్ ప్లే, ఇలా అన్నింటా గైడెన్స్ వుంటుంది.
సో, త్రివిక్రమ్ ఇంట్లో ఓ డైరక్టర్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే నిర్మాతగా సాయి సౌజన్య జర్నీ ప్రారంభించారు. సితార సంస్థతో కలిసి తాము నిర్మించిన రెండు కథలు, స్క్రిప్ట్ లు తానే ఓకె చేసానని, తన జడ్జిమెంట్ బానే వుంటుందని చెప్పుకొచ్చారు సాయి సౌజన్య. బుట్టబొమ్మ రీమేక్ కదా? అన్న అనుమానం వుంటే వుండొచ్చు. కానీ ఆవిడ చెప్పడం అలా చెప్పారు.
అక్కడితో ఆగలేదు..స్క్రిప్ట్ లు వింటున్నా, ప్రొడక్షన్ ఆఫీసు పనులు చూసుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇన్ సైడ్ అసలు విషయాలు తెలిసిన వారు మాత్రం ఫన్నీగా ఫీలవుతారు.