క‌ర్ణాటక ఎన్నిక‌లు.. రెడ్డి గారి అభ్య‌ర్థులూ రెడీ!

క‌ర్ణాట‌కలో అదేదో పార్టీ పెట్టారు గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి. భార‌తీయ జ‌న‌తా పార్టీకి పూర్తిగా దూరం అయిన‌ట్టుగా ప్ర‌క‌టించుకున్న గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కొన్ని నెల‌ల కింద‌ట పార్టీ ఏర్పాటును ప్ర‌క‌టించారు! గ‌త ఎన్నిక‌ల్లో…

క‌ర్ణాట‌కలో అదేదో పార్టీ పెట్టారు గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి. భార‌తీయ జ‌న‌తా పార్టీకి పూర్తిగా దూరం అయిన‌ట్టుగా ప్ర‌క‌టించుకున్న గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కొన్ని నెల‌ల కింద‌ట పార్టీ ఏర్పాటును ప్ర‌క‌టించారు! గ‌త ఎన్నిక‌ల్లో కూడా బీజేపీకి మ‌ద్ద‌తుదారుగానే కొన‌సాగిన గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి ఈ సారి మాత్రం సొంత పార్టీతో స‌త్తా చూపిస్తానంటూ ప్ర‌క‌టించారు. 

చివ‌రిసారి 2013లో కూడా గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి యాంటీ బీజేపీ వ‌ర్క్ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో జ‌నార్ద‌న్ రెడ్డి, శ్రీరాములు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఎన్నిక‌ల‌కు వెళ్లారు. శ్రీరాములు, గాలి సోమ‌శేఖ‌ర‌రెడ్డిలు ఆ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలుగా నెగ్గారు కూడా. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ అవ‌కాశాల‌ను దెబ్బ‌తీశారు. ఆ త‌ర్వాత బీజేపీలోకి ఆ పార్టీని విలీనం చేసిన‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఇప్పుడు శ్రీరాములు బీజేపీ త‌ర‌ఫునే బ‌రిలోకి దిగుతున్నారు.

అయితే జ‌నార్ధ‌న్ రెడ్డి మాత్రం త‌న పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించుకుంటున్నారు. ప్ర‌త్యేకించి తెలుగు బెల్ట్ లో జ‌నార్ధ‌న్ రెడ్డికి అభ్య‌ర్థుల లోటేమీ లేదు. బ‌ళ్లారి, చిక్ బ‌ళాపుర‌, కోలారు, తుమ‌కూరు జిల్లాల్లో జ‌నార్ధ‌న్ రెడ్డి పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థులు హ‌ల్చ‌ల్ చేస్తున్నారు. వీరి ప్ర‌భావం ఎంతో కానీ… జ‌నార్ధ‌న్ రెడ్డి పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థులు అయితే పోటీకి దిగుతున్నారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ అధిష్టానం త‌న‌ను ఖాత‌రు చేయ‌లేద‌నే ధోర‌ణితో జ‌నార్ద‌న్ రెడ్డి ఈ సొంత పార్టీని పోటీలో పెడుతున్నారు. మ‌రి ఈయ‌న అభ్య‌ర్థుల స‌త్తా ఎంతో!