పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా జంట మరోసారి మీడియాకు దొరికారు. ఇద్దరూ కలిసి రహస్యంగా ఎటో వెళ్లారు. వెళ్లినప్పుడు సీక్రెట్ గా వెళ్లిన ఈ జంట, తిరుగు ప్రయాణంలో మాత్రం కెమెరా కంటికి చిక్కింది. ముంబయిలోని ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తూ ఇద్దరూ ఇలా మీడియా కంటపడ్డారు.
తొలిసారి వీళ్లిద్దరూ ముంబయిలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకొస్తూ మీడియా కంటపడ్డారు. ఆ వెంటనే రాఘవ్ ను డేటింగ్ రూమర్స్ పై మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన నవ్వుతూ సమాధానం దాటేశారు. అటు పరిణీతి కూడా ఈ పుకార్లపై స్పందించలేదు.
మరోవైపు మరో ఆప్ ఎంపీ, వీళ్లిద్దరికీ ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయిపోయిందన్నట్టు శుభాకాంక్షలు తెలపడంతో ఇద్దరి వ్యవహారం మరింత హాట్ గా మారింది. ఈ క్రమంలో పరిణీతి-రాఘవ్ మరోసారి టూర్ కు వెళ్లడం, మీడియా కంట పడడం అందర్నీ ఆకర్షించింది.
యూకేలో చదువుకున్న రోజుల నుంచే పరిణీతి-రాఘవ్ ఒకరికొకరు తెలుసంట. వాళ్లిద్దరి మధ్య పరిచయం అప్పట్నుంచే కొనసాగుతోందట. అయితే ఈ పరిచయం ఈమధ్య కాలంలోనే ప్రేమగా మారిందంటోంది బాలీవుడ్. ప్రస్తుతం వీళ్లిద్దరి వ్యవహారశైలి చూస్తుంటే, త్వరలోనే పెళ్లికబురు మోసుకొచ్చేలా ఉన్నారు.