ఆపండ్రా…నేను ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేయ‌లేదు!

నిప్పు లేనిదే పొగ రాదంటారు. అయితే నిప్పు లేకుండానే పొగ పుట్టించ‌గ‌ల నేర్పరులు అవ‌త‌రించారు. నిజానిజాల‌తో సంబంధం లేకుండా ఒక వార్త‌ను పుట్టించ‌డం, దానిపై వాళ్లే అభిప్రాయాల‌ను వెల్ల‌డించ‌డం… త‌ద్వారా త‌మ ప్ర‌చారానికి ఊపు…

నిప్పు లేనిదే పొగ రాదంటారు. అయితే నిప్పు లేకుండానే పొగ పుట్టించ‌గ‌ల నేర్పరులు అవ‌త‌రించారు. నిజానిజాల‌తో సంబంధం లేకుండా ఒక వార్త‌ను పుట్టించ‌డం, దానిపై వాళ్లే అభిప్రాయాల‌ను వెల్ల‌డించ‌డం… త‌ద్వారా త‌మ ప్ర‌చారానికి ఊపు తెచ్చే ప్ర‌య‌త్నాలు అవిశ్రాంతంగా సాగుతూ వుంటాయి. 

తాను ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం చేశాన‌నే ప్ర‌చారంలో ఎంత మాత్రం నిజం లేద‌ని, దాన్ని ఆపండ్రా బాబూ అని ఓ న‌టి వేడుకుంటోంది. మ‌ల‌యాళ న‌టి భామ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకుందంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. స‌హ‌జంగానే ఇలాంటి వార్త‌ల‌కు ఆక‌ర్ష‌ణ ఎక్కువ‌. దీంతో న‌టి భామ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసేందంటూ భాష‌ల‌తో సంబంధం లేకుండా విస్తృతంగా వ్యాపించింది.

2017లో వేధింపుల కేసుపై తిరిగి విచార‌ణ మొద‌లు కావ‌డంతో భ‌యాందోళ‌న‌కు గురై…ఆమె త‌నువు చాలించేందుకు ఎక్కువ మోతాదులో నిద్ర‌మాత్ర‌లు మింగారంటూ ప్ర‌చార‌మైంది. ఈ క‌థ‌నాల‌పై ఆమె స్పందించారు.

'నాపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్లో, క‌థనాల్లో ఎలాంటి నిజం లేదు. నా గురించి ఎవ‌రూ ఆందోళ‌న చెందొద్దు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మీ ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె రాసుకొచ్చారు. ఇప్ప‌టికైనా ఆమెపై ఇలాంటి ప్ర‌చారం ఆగిపోతుంద‌ని ఆశిద్దాం.