పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నాడు. అల వైకుంఠపురములో చిత్రంతో నాన్ బాహుబలి రికార్డులు కైవసం చేసుకుని స్టార్‌గా తన రేంజ్‌ని మరింత పెంచుకున్న అల్లు అర్జున్ ఇక పాన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి పెట్టాడు.
సుకుమార్ కథలకు యూనివర్సల్ అప్పీల్ వుంటుంది కనుక అతనితో చేసే పుష్ప రైట్ ప్రాజెక్ట్ అని బన్నీ ఫీలవుతున్నాడు.
అయితే ఈ చిత్రంలో విలన్ పాత్రకు ముందుగా తమిళ హీరో విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ లాక్‌డౌన్ కారణంగా అతని షెడ్యూల్స్ అన్నీ తారుమారు కావడంతో అతను ఈ చిత్రం నుంచి స్వఛ్ఛందంగా తప్పుకున్నాడు.
అప్పట్నుంచీ సుకుమార్ సదరు పాత్రకు తగిన రీప్లేస్‌మెంట్ చూడలేకపోయాడు. దక్షిణాది నటుల కంటే బాలీవుడ్ నటులు ఎవరైనా ఆ పాత్ర చేస్తే పాన్ ఇండియా మార్కెట్‌కి హెల్పవుతుందని భావిస్తున్నారు.
హిందీ సినిమాల్లో హీరోగా చేసిన వాళ్లను ఎవర్నయినా విలన్ పాత్రకు ఎంచుకోవడం బెస్ట్ అని ప్రస్తుతం నేమ్స్ షార్ట్‌లిస్ట్ చేస్తున్నారు. త్వరలోనే విలన్ ఎవరనేది అధికారికంగా ప్రకటిస్తారు.
ఇదిలావుంటే ఈ చిత్రం రెగ్యులర్ షూట్ డిసెంబర్ లేదా జనవరి నుంచి ప్రారంభించి ఏడెనిమిది నెలలో షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని చూస్తున్నారు.