‘ఆర్.ఆర్.ఆర్.’ షూటింగ్ మే లేదా జూన్‌కి అయిపోతుందని త్రివిక్రమ్‌తో సినిమాను ఎన్టీఆర్ ముందుగానే లైన్‌లో పెట్టుకున్నాడు.
తీరా కరోనా కలకలంతో ఇప్పుడు రాజమౌళి మల్టీస్టారర్ ఎప్పటికి పూర్తవుతుందనేది ఎవరికీ తెలియడం లేదు. మామూలుగా అయితే రాజమౌళి సినిమా అయ్యేవరకు హీరోలకు ఏ చింత అక్కర్లేదు.
కానీ త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకుడిని వెయిటింగ్‌లో పెట్టినపుడు ఒత్తిడి తప్పదు. తెలుగు చిత్ర పరిశ్రమ మళ్లీ యాక్టివ్ అయిపోయి పెద్ద సినిమాల షూటింగులు కూడా మొదలవుతున్నాయి.
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌కి తాను ఎప్పుడు అందుబాటులో వుండేదీ అనేదానిపై ఎన్టీఆర్ ఖచ్చితమయిన క్లారిటీ ఇవ్వాల్సి వుంటుంది.
రాజమౌళికే తెలియని ఆ సంగతిపై ఎన్టీఆర్ ఎలా క్లారిటీ ఇస్తాడు? ఎన్టీఆర్ పడుతోన్న ఈ టెన్షన్ చూసి మరో హీరో చరణ్ జాగ్రత్త పడ్డాడు. తదుపరి సినిమాను ఇంతవరకు ఎవరితోను ఖరారు చేసుకోలేదు.
పలు కథలు విన్నా కానీ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టాడు. ‘ఆర్.ఆర్.ఆర్.’ షూటింగ్ ఎప్పుడు పూర్తయితే అప్పుడే మలి చిత్రం గురించి డిసైడ్ అవ్వాలనుకుంటున్నాడు. అయితే ఈలోగా ఆచార్యలో ప్రత్యేక పాత్ర మాత్రం చేస్తాడు.