ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు ఒకరికొకరు కొట్టుకున్నారు.
టెండర్ల కేటాయింపు విషయమై ఇరువర్గాల మధ్య ప్రారంభమైన వాగ్వాదం ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది. టెండర్లను అధికార పార్టీకి చెందినవారికి కట్టబడెడుతున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించగా.. వైసీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.
ఘర్షణలో పలువురు కౌన్సిలర్లకు గాయాలు కావడంతో పాటు చొక్కాలు చిరిగాయి. దీంతో సమావేశాన్ని చైర్మన్ అర్ధాంతరంగా వాయిదా వేశారు. మున్సిపాలిటీలోని ప్రజల సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిలర్లు ఇలా సభలోనే ఒకరిపై ఒకరు తన్నులాడుకోవడంపై పలువురు మండిపడుతున్నారు.