Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలీవుడ్ లో విలువల్లేవ్.. కాజల్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ లో విలువల్లేవ్.. కాజల్ సంచలన వ్యాఖ్యలు

ఒక్క హిందీ ఆఫర్ వస్తే చాలు సౌత్ సినిమాను చిన్నచూపు చూసే హీరోయిన్లు చాలామంది. సౌత్ మేకర్స్ కు సినిమాలు తీయడం రాదని, ఎంత సేపు బొడ్డుపై ఆపిల్స్ పెట్టడమే పని అంటూ ఆమధ్య ఓ హీరోయిన్ కామెంట్ చేసింది. మరో హీరోయిన్, సౌత్ మేకర్స్ హీరోయిన్ల కాళ్లు, తొడలు చూపించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంటూ కామెంట్ చేసింది. ఇంకొంతమంది కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కూడా చేశారు. ఇలా ఏరు దాటాక తెప్ప తగలేసే హీరోయిన్లను మనం చూశాం.

అయితే కాజల్ అలా కాదు. తనకు గుర్తింపు తీసుకొచ్చిన తెలుగు-తమిళ సినీ ఇండస్ట్రీలపై ప్రేమ కురిపించింది ఈ ముద్దుగుమ్మ. అలా అని ఆమె డిప్లమాటిక్ గా కూడా వ్యవహరించలేదు. సౌత్-నార్త్ సినీ ఇండస్ట్రీల మధ్య తేడాల్ని కుండబద్దలుకొట్టినట్టు చెప్పేసింది. సౌత్ లో కనిపించిన క్రమశిక్షణ, విలువలు తనకు బాలీవుడ్ లో కనిపించలేదంటోంది కాజల్ అగర్వాల్.

"హిందీ నా మాతృభాష. బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాను. బాలీవుడ్ చాలా మంచి ఇండస్ట్రీ. నాకు కొన్ని అవకాశాలు కూడా ఇచ్చింది. అయితే దక్షిణాది సినీ పరిశ్రమల్లో ఉన్న సినీ వాతావరణం, విలువలు, క్రమశిక్షణ కు నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. బాలీవుడ్ లో ఈ క్వాలిటీస్ లేవు."

నిండు సభలో ఇలా నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని బయటపెట్టింది కాజల్. నార్త్ లో అవకాశాలు వచ్చిన వెంటనే సౌత్ ను చిన్నచూపు చూసే హీరోయిన్లంతా కాజల్ ను చూసి నేర్చుకోవాలి. ఇదే వేదికపై హైదరాబాద్-చెన్నైపై తనకున్న ప్రేమను బయటపెట్టింది కాజల్.

"నేను ముంబయి అమ్మాయిని. కాకపోతే నా కెరీర్ టాలీవుడ్ లో మొదలైంది. నేను ఎక్కువగా తెలుగు-తమిళ సినిమాలే చేశాను. కొన్ని హిందీ సినిమాలు చేశాను. హైదరాబాద్, చెన్నైలో ఉన్నప్పుడు నాకు హోమ్ ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ ఎప్పటికీ మారదు. నా ప్రాధాన్యత ఎప్పుడూ సౌత్ సినిమాకే."

సక్సెస్ లో ఉన్న హీరోయిన్లకు బాడీ షేమింగ్, ట్రోలింగ్ వంటివి కామన్ అంటోంది కాజల్. గర్భంతో ఉన్నప్పుడు కూడా తనను బాడీ షేమింగ్ చేశారని.. కడుపులో బిడ్డ ఉన్నప్పుడు లావెక్కకుండా ఎలా ఉంటామని ప్రశ్నించింది. ఇలా ట్రోల్ చేసే వ్యక్తులు నిత్యం మన చుట్టూ తిరుగుతుంటారని, వాళ్లను పట్టించుకోకుండా మన పని మనం చేసుకుపోవాలంటోంది కాజల్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?