‘అల’లు ఆగడం లేదుగా?

ఒక్కోసారి అంతే, ఒక్కో సినిమాను ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకుంటారు. గత ఏడాది ఎఫ్ 2 అనే సినిమాను నెత్తిన పెట్టుకుని, కలెక్షన్ల కనక వర్షం కురిపించేసారు.  అంతకు ముందు గీతగోవిందం అనే సినిమాను కింగ్…

ఒక్కోసారి అంతే, ఒక్కో సినిమాను ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకుంటారు. గత ఏడాది ఎఫ్ 2 అనే సినిమాను నెత్తిన పెట్టుకుని, కలెక్షన్ల కనక వర్షం కురిపించేసారు.  అంతకు ముందు గీతగోవిందం అనే సినిమాను కింగ్ కుర్చీలో కూర్చో పెట్టేసారు.  ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమాను అలా మోసేస్తున్నారు. నిన్నటికి నిన్న కూడా నైజాంలో రెండు కోట్లకు రెండు పదులు తక్కువగా షేర్ రావడం అంటే ఏమనుకోవాలి? 

18 కోట్ల అడ్వాన్స్ మీద ఎన్ఆర్ఎ చేసిన సినిమాకు ఇప్పటికి 29 కోట్లు వచ్చింది. 10 కోట్లకు ఎన్ఆర్ఎ చేసిన వైజాగ్ లో 15 కోట్లు వచ్చింది. అంటే రెండూ కలిపి 44 కోట్లు. దీని మీద డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు వచ్చే 20 శాతం కమిషన్ నే ఓ మీడియం సినిమా బడ్జెట్ అంత వుంటుంది. కానీ ఇక్కడితో ఆగేలా లేదు. ఇంకా ముందుకే వెళ్లేలా వుంది చూస్తుంటే. 

ఇప్పటికి అంటే తొమ్మిది రోజులకు జిఎస్టీ కలపకుండా,  ఫిక్స్ డ్ హయ్యర్లు, వంటి వ్యవహారాలు ఏవీ జోడించకుండా, కేవలం టికెట్ ల రోజువారీ అమ్మకాల మీద వచ్చిన ఒరిజినల్ షేర్ లు ఇలా వున్నాయి. 

ఈ లెక్కన చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లు దాటే సినిమా అయ్యేలా వుంది. బహుశా బాహుబలి తరువాత ఈ ఫీట్ సాధించిన సినిమా ఇదేనేమో?

nizam 29 cr
ceaded..15.78 cr
vizag  15 cr
east 8.10 cr
west 6.08 cr
krishna 7.62 cr
guntur…8.05 cr
nellore…3.49 cr

సునీల్ టైమింగ్ కి హాట్స్ ఆఫ్