Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవన్ విచిత్ర ప్రయాణం.. దిల్ రాజుకు దినదిన గండం

పవన్ విచిత్ర ప్రయాణం.. దిల్ రాజుకు దినదిన గండం

పవన్ కల్యాణ్ సినిమాకు కాల్షీట్లిచ్చాడన్నమాటే కానీ.. నిర్మాత దిల్ రాజు సహా చిత్ర బృందానికి షూటింగ్ టైమ్ దినదిన గండంగా మారింది. ఉదయం ఏడు గంటలకే షూటింగ్ స్పాట్ కి వచ్చే పవన్ మధ్యాహ్నం వరకు హైదరాబాద్ లో చిత్రీకరణలో పాల్గొని ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల కోసం మంగళగిరికి వెళ్తున్నారు. ఇది ఒక రోజు, రెండు రోజుల ముచ్చట కాదు.. దాదాపు 3 నెలలు పవన్ ఇలానే చేయాల్సి ఉంటుంది.

అయితే మొదటి రోజే పవన్ కు పరిస్థితి అర్థమైపోయింది. మధ్యాహ్నమే ప్యాకప్ చెప్పే పవన్, రాత్రికి మంగళగిరి చేరుకున్నారు. అర్థరాత్రి వరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో హడావిడి చేశారు. మళ్లీ ఈరోజు షూటింగ్ కు హాజరవ్వాలి. అంటే రాత్రి రెస్ట్ లేకుండానే ఈరోజు షూటింగ్ అన్నమాట. మామూలుగానే మూడ్ వచ్చేవరకు షాట్ కు రారు పవన్. అలాంటిది ఇంత అలిసిపోయి షూటింగ్ అంటే అనుమానమే. దర్శక-నిర్మాతల్ని టెన్షన్ పెడుతున్న అంశం ఇదే. ఎన్నాళ్లిలా బండి నడుస్తుందో చూడాలి.

తొలిరోజే మంగళగిరి పార్టీ కార్యాలయంలో విపరీతమైన హడావిడి జరిగింది. ఈరోజు షూటింగ్ పై ఆ ఎఫెక్ట్ కచ్చితంగా పడుతుంది. పోనీ ఇది ఒక రోజుతో పోయేదా అంటే అదీ కాదు. ఉదయం షూటింగ్, సాయంత్రం పార్టీ మీటింగ్ అంటూ షెడ్యూల్స్ వేసుకున్న పవన్ రెండు పడవలపై విచిత్ర ప్రయాణం చేస్తున్నారు. పోనీ ఒకదానికొకటి ఇంటర్ లింక్ ఉన్న వ్యవహారాలా అంటే అదీ కాదు. ఒకేచోట జరుగుతున్నాయా అంటే అది కూడా కాదు. షూటింగ్ హైదరాబాద్ లో, మీటింగ్ లు మంగళగిరిలో.. 

మొత్తమ్మీద ఈ వ్యవహారం పవన్ కి కొత్తగా అనిపించొచ్చు కానీ, సినిమా మీద ఆశలు పెట్టుకున్నవారికి మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంది. పార్టీ మీటింగ్ లో ఏదైనా హడావిడి జరిగినా, పవన్ అందుబాటులో ఉండాల్సిన అవసరం వచ్చినా ఆ మరుసటి రోజు షూటింగ్ క్యాన్సిల్ కావాల్సిందే. మరీ ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ చెప్పినట్టు నడుచుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రతి రోజూ షూటింగ్ సస్పెన్స్ సినిమాను తలపించడం ఖాయం. పవన్ వస్తాడా రాడా అనేది ఏరోజుకారోజు చెక్ చేసుకోవాల్సిందే.

పైగా షూటింగ్ అంటే పవన్ ఒక్కడితో ముడిపడి ఉన్న వ్యవహారం కాదు. మిగతావారందరి కాల్షీట్లు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఆటోమేటిగ్గా నిర్మాతకు ఆర్థిక నష్టం. దర్శకుడికి తలనొప్పి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా షూటింగ్ అనేది దిల్ రాజుకు దినదిన గండం, నూరేళ్ల ఆయుష్షు టైపులో మారింది. ప్రతి నిమిషం టెన్షన్, ప్రతి రోజూ అనుమానం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?