వరుసగా రెండోసారి హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్

వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. అయితే అతడు చేసిన రెండో సినిమా కొండపొలం మాత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. మరి అలాంటి సినిమా ఇప్పుడేదో కొత్తగా…

వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. అయితే అతడు చేసిన రెండో సినిమా కొండపొలం మాత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. మరి అలాంటి సినిమా ఇప్పుడేదో కొత్తగా హిట్టయిందేంటని అనుకుంటున్నారా? నిజమే.. కొండపొలం సినిమా హిట్టయింది. కాకపోతే థియేటర్లలో కాదు, బుల్లితెరపై.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారం చేసిన ఈ సినిమాకు ఏకంగా 12.34 టీఆర్పీ వచ్చింది. అంటే.. బుల్లితెరపై ఈ సినిమా సూపర్ హిట్టయినట్టే లెక్క. థియేటర్లలో అంతగా ఆడని ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై బాగా క్లిక్ అయిందన్నమాట.

వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెనను తొలిసారి టీవీల్లో ప్రసారం చేసినప్పుడు గరిష్టంగా 18 టీఆర్పీ వచ్చింది. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు రేటింగ్స్ తర్వాత ఉప్పెన సినిమాదే మూడో స్థానం. ఇప్పుడు కొండపొలం సినిమాతో మరోసారి మంచి టీఆర్పీ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కింది కొండపొలం సినిమా. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన ఈ సినిమా అవార్డుల కోసం తీశారేమో అనిపిస్తుంది తప్ప, ఎమోషన్ ను పూర్తిస్థాయిలో పండించలేకపోయింది.