చూసి నేర్చుకో తమ్ముడూ.. అంబటి పంచ్ అదిరింది

మంచి టైమింగ్ చూసి పంచ్ వేయడంలో అంబటి తర్వాతే ఎవరైనా. ఈసారి కూడా వైసీపీ నేత అంబటి రాంబాబు తన పంచ్ పవర్ చూపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చిరంజీవి భేటీని దృష్టిలో పెట్టుకొని,…

మంచి టైమింగ్ చూసి పంచ్ వేయడంలో అంబటి తర్వాతే ఎవరైనా. ఈసారి కూడా వైసీపీ నేత అంబటి రాంబాబు తన పంచ్ పవర్ చూపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చిరంజీవి భేటీని దృష్టిలో పెట్టుకొని, పవన్ కల్యాణ్ పై విసుర్లు విసిరారు అంబటి. ఇంతకీ ఆయన ఏమన్నారో.. ఆయన మాటల్లోనే..

“పరిశ్రమ సమస్యలు తిట్ల దండకంతో కాదు, చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయని అన్నయ్యను చూసి నేర్చుకో తమ్ముడు!”. ఇది పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు వేసిన పంచ్.

ఏపీలో తగ్గించిన సినిమా టికెట్ రేట్లపై విమర్శలు చేస్తూ పవన్ కల్యాణ్ హద్దుమీరిన సంగతి తెలిసిందే. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేని సన్నాసి అంటూ అనుచిత పదాన్ని వాడారు పవన్. ఆ తర్వాత అది ఎంత పెద్ద వివాదానికి దారితీసిందో అందరికీ తెలిసిందే. 

వైసీపీ నేతలంతా పవన్ కల్యాణ్ పై విరుచుకుపడడం ఒకెత్తయితే.. ఏకంగా సినీ పెద్దలే పవన్ కల్యాణ్  చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. అలా ఎటువైపు నుంచి మద్దతు లేక సైలెంట్ అయ్యారు పవన్.

మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవి, జగన్ తో భేటీ అవ్వడంతో గతంలో పవన్ సృష్టించిన అలజడి ఎపిసోడ్ ను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు అంబటి. ఇష్టమొచ్చినట్టు తిడితే సమస్యలు పరిష్కారం కావని, చర్చల ద్వారా మాత్రమే మంచి ఫలితాలొస్తాయని పవన్ కు చురకలంటించారు.