ఈ సంక్రాంతికి ముచ్చటగా మూడు సినిమాలు వస్తున్నాయి. మూడు సినిమాల్లోనూ 'కొడుకులు' కీలకం కావడం విశేషం. ముగ్గురు కొడుకులకు ఈ మూడు సినిమాలు చాలా కీలకమే. నాగ్ చైతన్య కీలకపాత్రలో నటించిన బంగార్రాజు, నిర్మాత, పంపిణీ దారు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి నటించిన రౌడీ బాయ్స్, పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ తనయుడు అశోక్ నటించిన హీరో సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి.
చైతన్య కెరీర్ ప్రస్తుతం బాగానే వుంది. అయితే హిట్ అన్నది ఎప్పటికీ అవసరమే. మార్కెట్ ను స్టడీగా వుంచుకోవాలంటే హిట్ అవసరం. పైగా చైతన్య ఇప్పటి వరకు ఈ పల్లెటూరి మాస్ గెటప్ చేయలేదు. తొలిసారి చేస్తున్నాడు. మనం సినిమా తరువాత తండ్రీ కొడుకుల కాంబినేషన్ లో వస్తున్న సినిమా. ఫ్లాప్ ల్లో వున్న నాగ్ కు కూడా ఈసినిమా చాలా కీలకం. లవ్ స్టోరీ తరువాత చైతన్య చేస్తున్న సినిమా ఇది.
నిర్మాతగా, పంపిణీ దారుగా శిరీష్ అనేక విజయాలు చూసారు. తొలిసారి ఆయన కొడుకు హీరోగా తెరపైకి వస్తున్నారు. బాబాయ్ దిల్ రాజుకు కూడా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. ఎంతో మంది యంగ్ హీరోలకు హిట్ లు ఇచ్చారు. ఫ్లాపులు ఇచ్చారు. అలాంటిది స్వంత హీరోకి హిట్ ఇచ్చి తీరాలి. అందుకే రౌడీ బాయ్స్ సినిమా ఆయనకు చాలా కీలకం.
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్. అంతే కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త, పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ వారసుడు. ఎప్పటి నుంచో తెరపైకి రావాలనుకుంటున్నాడు. నిర్మాత దిల్ రాజుతో ప్రాజెక్ట్ ట్రయ్ చేసారు. ఆపేసారు. స్వంతగా ప్రాజెక్ట్ చేసారు. ఇప్పుడు హిట్ కొట్టి తీరాలి. బోలెడు ఖర్చుతో నిర్మించిన సినిమా ఇది. ఇది సక్సెస్ అయితే హీరో కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చినట్లు అవుతుంది.