cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

రౌడీ బాయ్స్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్

రౌడీ బాయ్స్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్

శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు . ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. ఈ సందర్బంగా  సినిమా విశేషాలను నిర్మాత దిల్ రాజు, హీరో ఆశిష్ ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. .

హీరో ఆశిష్ మాట్లాడుతూ...చిన్నప్పటి నుంచి డాన్సులు చేసేవాడిని. ఫ్యామిలీ ఈవెంట్స్ , పార్టీలలో డాన్సులు చేసేవాడిని. మెల్లమెల్లగా డాన్సులు బాగా అలవాటు అయ్యాయి. అల్లు అర్జున్ నాకు ఇన్సిపిరేషన్. ఆయనలా నేర్చుకోవాలని అనుకున్నాను. కానీ నేను చేయగలనా లేదా అని సందేహపడ్డాను. కొన్ని కోర్సులు చేసాను. సత్యానంద్ దగ్గర, భిక్షు దగ్గర నటనలో శిక్షణ  తీసుకున్నాను. న్యూయార్క్ లో ఫిలిం కోర్సుల చేశాను. కేరింత సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను.   

రౌడీ బాయ్స్ ఇంజినీరింగ్ వర్సెస్ మెడికల్ స్టూడెంట్స్ కథ అనగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. నా ఏజ్ గ్రూప్ క్యారెక్టర్ కథ కాబట్టి సులువుగా కథలోకి వెళ్లగలిగాను. దర్శకుడు హర్ష మేమూ కలిసి రోజుకు గంటల పాటు వర్క్ షాప్ చేసేవాళ్లం. ఒక రిఫరెన్స్ లాంటిది తీసుకోలేదు. ముందు రోజే సీన్ పేపరు తీసుకుని ప్రిపేర్ అయ్యేవాడిని. రొమాంటిక్ సీన్స్ చాలా కష్టంగా ఉండేది. ప్రతి రోజూ ప్రిపేర్ అయ్యే సెట్ కు వెళ్లేవాడిని. నేను అప్పటికప్పుడు చేసే ఆర్టిస్ట్ ను కాదు. ఒక డాన్స్ నెంబర్ కోసం టెన్షన్ పడ్డాను. దానికి ప్రిపేర్ కాకుండా స్పాట్ లో  జాని మాస్టర్ చెప్పేది చూసి నేర్చుకున్నాను. 

రౌడీ బాయ్స్ సినిమాకు వచ్చే రెస్పాన్స్ ను బట్టి నా నెక్ట్ సినిమాలను ఎంచుకుంటాను . సినిమాలో  మొత్తం 9 పాటలు ఉన్నాయి. మిగతావన్నీ సందర్భానుసారం వస్తాయి. ట్రైలర్ చూశాక రెస్పాన్స్ బాగా వచ్చింది. ఈజ్ తో చేస్తున్నావ్, కొత్త యాక్టర్ లా చేయడం లేదు అని చెప్పారు. అది చాలా సంతోషాన్ని ఇచ్చాయి.

దేవి శ్రీ ప్రసాద్ నా సినిమాకు వర్క్ చేస్తున్నారు అనగానే చాలా సంతోషపడ్డాను. అలాగే సినిమాటోగ్రాఫర్ మది ఇన్వాల్వ్ మెంట్ సూపర్బ్. ప్రతి విషయం దగ్గరుండి చూసుకుంటారు. కాశీ అనే కొత్త దర్శకుడితో సెల్ఫిష్ అనే టైటిల్ తో కొత్త సినిమా చేస్తున్నాను అన్నారు ఆశిష్.

దిల్ రాజు మాట్లాడుతూ...డాన్సులు బాగా చేసేవాడు ఆశిష్. మా ఇంట్లో కార్యక్రమాల్లో బాగా డాన్సులు చేసేవాడు. అప్పటి నుంచే మేము హీరో అనిపిలిచేవాళ్లం. హీరో గా ఎదగడం అంత సులువు కాదని చెప్పేవాళ్లం. నేను ప్రాక్టీస్ చేస్తా అని చెప్పేవాడు. అప్పట్లో బాగా లావు ఉండేవాడు. తర్వాత సన్నబడ్డాడు. తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాడు. న్యూయార్క్ లో థియేటర్ చేశాడు. 2018 లో నేను రెడీ బాబాయ్ ఏదైనా కథ ఉంటే చెప్పమన్నాడు. అలా ఆశిష్ జర్నీ స్టార్ట్ అయ్యింది. 

పెద్ద దర్శకుడితో లాంచింగ్ పెట్టుకుని వెళ్లొచ్చు. నేను నా కెరీర్ చిన్నగా స్టార్ట్ చేశాను. ఆర్టిస్టుకు ప్రేక్షకుల యాక్సెప్ట్ చేయడం కావాలి. అది కంటెంట్ కథలో ఉంటేనే జరుగుతుంది. నేను మంచి స్టోరీస్ తోనే ఒక్కో మెట్టు ఎదిగాను. నా 9 చిత్రాలు స్టార్ లు లేకుండానే చేశాను. కుర్రాడిని అతనిని స్వతహాగా ఎదగాలని నేను కోరుకున్నాను. రెండు మూడు చిత్రాలు చేస్తేనే ఆశిష్ కు అనుభవం వస్తుంది.

కొత్త హీరోను పెద్ద బడ్జెట్ పెట్టి ఒత్తిడికి లోను కాలదల్చుకోలేదు. ఒక ప్యాకేజ్ సినిమా చేస్తే అందులో హీరో ఒక పార్ట్ అవుతాడు అంతే. అతనికి స్పెషల్ గా గుర్తింపు రాదు. ఈ సినిమా పూర్తిగా యూత్ ఫుల్ సినిమా. దర్శకుడు హర్ష చేసిన హుషారు సినిమా రిలీజ్ అయ్యాక అతన్ని కథ చెప్పమని అడిగాను.  అతని కాలేజ్ టైమ్ లో జరిగిన కథ ఇది. ఆడియెన్స్ థియేటర్ లో బోర్ కొట్టకుండా ఉంటుందని అనిపించింది. ఆశిష్ డాన్సులు, పర్మార్మెన్స్ చేయాలి, నవ్వించాలి, ఎమోషనల్ సీన్స్ చేయాలి అనుకున్నాను. సినిమా అలా చేస్తూ మౌల్డ్ చేస్తూ వచ్చాం. రౌడీ బాయ్స్ మేకింగ్ టైమ్ లో కంప్లీట్ ఔట్ పుట్ సంతృప్తిగా మారిపోయింది.

ఆశిష్ కు మ్యూజికల్ ఈవెంట్ లో చెప్పాను. నీకు ఒకటి రెండు సినిమాలు నేను సపోర్ట్ చేస్తాను. ఆ తర్వాత నువ్వే వెతుక్కోవాలి అని చెప్పాను. అలా కెరీర్ ప్లాన్ చేసుకోవాలని చెప్పాను. ఒక సినిమాకు పెట్టే బడ్జెట్, దాని రికవరీ గురించి నిర్మాతగా ఆలోచిస్తుంటాను. ఆశిష్ అనేది రేపు ఒక బ్రాండ్ కావాలి. నీదైన ప్రత్యేకత లేకుంటే ప్రేక్షకులు గుర్తు పెట్టుకోరు. స్క్రిప్ట్ సెలెక్షన్, హార్డ్ వర్క్ ఏ హీరో నైనా నిలబెడుతుంది. కొన్ని సినిమాల తర్వాత పూర్తిగా అతనికే స్వేచ్ఛ నిస్తాను. మరొకరి మీద ఆధారపడకూడదు.

నా సినిమాలను ఎంతమంది ఇష్టపడతారో తెలుసు. ఫ్యామిలీస్ కు నా సినిమాలు ఇష్టం. మరికొందరికి నా సినిమాలు మూస అనిపిస్తాయి. కొన్నిసార్లు నా బ్రాండ్ దాటి సినిమాలు చేయాలి. రౌడీ బాయ్స్ కంప్లీట్ గా యూత్ సినిమా. ఇప్పటిదాకా నా సినిమాల్లో ముద్దు సీన్స్ ఉండవు. కానీ ఫస్ట్ టైమ్ ఈ చిత్రంలో కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అందుకే ట్రైలర్ లోనే ముద్దు సీన్ రివీల్ చేశాం. రేపు ఫ్యామిలీ ఆడియెన్స్ మా సినిమాకు వచ్చి ఇబ్బందిపడొద్దనే అలా ట్రైలర్ లో కిస్ సీన్ పెట్టాం. కాలేజ్ కు వెళ్లే స్టూడెంట్ ఎలా ఉంటాడో ఆశిష్ క్యారెక్టర్ అలా ఉంటుంది. అతని లైఫ్ లో కొన్ని ఇబ్బందులు అధిగమించి ఎలా ఎదిగాడో ఆసక్తికరంగా ఉంటుంది. .

నా తర్వాత హర్షిత్, అన్షిత కానీ ప్రొడక్షన్ లోకి వస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్లు రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. కొత్త జెనరేషన్ వచ్చింది. వాళ్ల ఆలోచననూ అంగీకరించాలి. మాదే కరెక్ట్ అనుకోవద్దు. వాళ్లకు వెల్ కమ్ చెబుతున్నా. కొత్త రైటర్స్ కథలు చెబుతున్నారు. 

ట్రైలర్ రిలీజ్ అయ్యాక రౌడీ బాయ్స్ సినిమాపై అంచనాలు పెరిగాయి. అప్పటిదాకా ఏదో చూద్దాం అనే ఒపీనియన్ ఉండేది. ట్రైలర్ తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చారు అంతా.  రిలీజ్ ఎప్పుడో తెలియక పాటలకు ప్రచారం కోసం కొంత కంగారుపడ్డాం. రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ రిలీజ్ లేదు అనగానే త్వరత్వరగా చేసుకుంటూ వచ్చాం. సినిమా చూశాక మళ్లీ వచ్చి పాటలు వింటారు. ఆ నమ్మకం ఉంది. క్లైమాక్స్ పాట ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. కథ ప్రకారమే సినిమాలో 9 పాటలు పెట్టాం. రౌడీ బాయ్స్ ఒక మ్యూజికల్ ట్రీట్. చివరి 20 నిమిషాల్లో బ్యాక్ టు బ్యాక్ పాటలు వస్తాయి. కానీ అవెక్కడా బోర్ కొట్టవు.

సుకుమార్ రైటింగ్స్ లో ఆశిష్ నెక్ట్ ఫిల్మ్ ఉంటుంది. కాశీ దర్శకుడు. సుక్కూ దగ్గర పనిచేశాడు కాశీ. ఆయన కథ వినండని సుక్కు చెప్పాడు. కథ వింటే బాగుంది. సుక్కూతో అదే చెప్పాను. అప్పుడే ఆశిష్ తో చేద్దామని ఫిక్స్ అయ్యాను. సెకండ్ ఫిల్మ్ గా సెల్ఫీష్ ఉంటుంది. నేనూ సుకుమార్ నిర్మాతలం అన్నారు దిల్ రాజు.

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు