పెళ్లి, విడాకులపై సమంత కామెంట్స్‌!

యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ అందుకున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. శాకుంతలం సినిమా ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉన్న స‌మంత పెళ్లి, విడాకుల‌పై…

యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ అందుకున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. శాకుంతలం సినిమా ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉన్న స‌మంత పెళ్లి, విడాకుల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

స‌మంత మాట్లాడుతూ.. వైవాహిక బంధంలో పూర్తి నిజాయితీగా ఉన్నా అది వ‌ర్కౌట్ కాలేదని.. విడాకులు తీసుకున్న కొంత‌కాలానికి పుష్ప‌లో ఐటాం సాంగ్ ఆఫ‌ర్ వ‌స్తే ఓకే చెప్పాన‌ని.. కానీ చాలా మంది.. ఇంట్లో కూర్చో చాలు. ఈ టైంలో ఐటెం సాంగ్స్ క‌రెక్ట్ కాదు అని స‌ల‌హా ఇచ్చార‌ని.. నేనేం త‌ప్పు చేయ‌న‌ప్పుడు ఇంట్లో కూర్చొని ఎందుకు బాధ‌ప‌డాలి.. పాటలో (లిరిక్స్‌) సాహిత్యం నచ్చడం వల్లే అందరూ చేయకూడదని చెప్పినా పుష్ప పాట చేశానని చెప్పుకొచ్చింది సమంత.

మయోసైటిస్‌, మెడికేషన్‌ కారణంగా ఆరోగ్యం కంట్రోల్‌ లేకుండా పోయిందని అందుకే కళ్లద్దాలు వాడుతున్నాను అని.. అంతే త‌ప్పా ఏదో స్టైల్‌ కోసం కాదని.. వెలుతురిని త‌న‌ కళ్లు తట్టుకోలేవ‌ని.. ఇలాంటి ఇబ్బంది ఏ నటికీ రాకూడదు అని అవేద‌న వ్య‌క్తం చేసింది. కాగా శాకుంతలం ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది. మరోవైపు విజయ్‌ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది. శివనిర్వాణ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది.