ఆదాని గ్రూప్ ద్వారా విశాఖలో మళ్టీ బేసెడ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు జగన్ పచ్చజెండా ఊపారు. విశాఖలో అదాని గ్రూప్ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. తొందరలో తన పాజెక్టులను మొదలెట్టబోతోంది.
అదానీ గ్రూప్ ద్వారా విశాఖలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్కు, స్కిల్ వర్సిటీ, రిక్రి యేషన్ సెంటర్ వంటివి రానున్నాయి. ఇందుకోసం ఏకంగా 15 వేల కోట్ల పెట్టుబడులతో ఆదాని రంగంలోకి దిగుతోంది.
దీనికి గానూ వైసీపీ సర్కార్ 130 ఎకరాలను మాత్రమే ఇస్తోంది. ఇక అదాని ప్రాజెక్టుల ద్వారా దాదాపుగా పాతిక వేల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి.
గతంలో టీడీపీ సర్కార్ అయిదు వందల ఎకరాలు ఆదానికి ఇచ్చి కూడా కేవలం ఆరు వేల మందికి మాత్రమే ఉపాధి కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇపుడు అందులో మూడవ వంతు భూమి మాత్రమే వైసీపీ ఇస్తూంటే నాలుగు రెట్లు ఉపాధి అవకాశాలు పెంచడం అంటే నిజంగా ఇది అద్భుతమైన ఒప్పందం అని చెప్పాలి
ఇక అదానీ గ్రూప్ విశాఖ నుంచి వెళ్ళిపోయిందని అబద్దాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ ఇపుడు ఏమంటుందో చూడాలి. మొత్తానికి విశాఖను ఐటీ రాజధానిగా చేసే విషయంలో వైసీపీ చిత్తశుద్ధి మరో మారు స్పష్టమైంది.