ఇదిగో డైరక్టర్ అంటే అదిగో సినిమా అనడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా ఇమేజ్ కోసం హీరోలు ప్రయత్నిస్తుంటే దానికి తగిన డైరక్టర్లను ఎంచుకుని ఫ్యాన్స్‌నే కాంబినేషన్లు సెట్ చేస్తున్నారు. దీనికి తోడు తమిళ దర్శకులు మన హీరోల మీద విపరీతంగా కన్నేసి వుంచారు.
అట్లీ లాంటి వాళ్లు తెెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడయితే హీరో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడో అతగాడి మీద బోలెడు మంది దర్శకుల దృష్టి పడింది. ఈ క్రమంలో చాలా మంది బన్నీని కలుస్తున్నారు.
అయితే బన్నీ సన్నిహిత వర్గాల బోగట్టా ప్రకారం ఆయన ప్లానింగ్ ఇలా వుంది.
బన్నీ కి పుష్ప సినిమా షూట్ ఏప్రిల్ చివరి వరకు వుంది. ఆ తరువాత ఓ నెల రోజులు ప్రచారం వుంటుంది. ఆగస్టులో విడుదల వుంది. అందువల్ల సెప్టెంబర్ కు కానీ కొత్త సినిమా ప్రారంభించరు. ఈ సినిమా పక్కాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే. సబ్జెక్ట్ ఫైనల్ అయింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా.
దాని తరువాత సందీప్ వంగాతో చేయాలన్నది ప్లాన్. కానీ అప్పటికి సందీప్ వంగా డేట్స్ ఎలా వుంటాయి అన్నది చూడాల్సి వుంది. అప్పటి వరకు తన కోసం వెయింటింగ్ లో వుండొద్దని, ఈ లోగా ఓ సినిమా చేసుకుని రమ్మని దర్శకుడు నీల్సన్ కు క్లారిటీగా చెప్పేసారు. ఇక అట్లీతో సినిమా అన్నది ఇప్పట్లో ప్లానింగ్ లోనే లేదు.
త్రివిక్రమ్ తో సినిమా అయ్యే సరికే 2025 సమ్మర్ వస్తుంది. అందువల్ల మరే ఇతర సినిమా అయినా ఆ తరువాతే.