పూజా హెగ్డే బ్యూటీకి మొదట్నుంచీ ఫాన్స్ ఎక్కువే. అందుకే ఆమె సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా పెద్ద చిత్రాల్లో అవకాశాలు వస్తూనే వున్నాయి. అయితే ఇన్నాళ్లు ఆమెకి భారీ విజయం మాత్రం దక్కలేదు. యావరేజ్‌గా ఆడిన డిజె, అరవింద సమేత, మహర్షి లాంటి చిత్రాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆమె హీరోయిన్ అయితే పెద్ద హిట్ రాదనే ఫీలింగ్ కూడా బలపడిపోయింది.
ఇలాంటి టైమ్‌లో 'అల వైకుంఠపురములో' చిత్రంతో పూజ హెగ్డే తొలి బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఈ చిత్రం అంచనాలకి మించి ఆడేస్తూ వుండడంతో పూజ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఈ చిత్రంలో అవకాశాన్ని ఆమె దాదాపు చేజార్చుకుంది. హౌస్‌ఫుల్ 4తో క్లాష్ రావడంతో పలుమార్లు ఆమె ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వలేకపోయింది. అయితే లక్కీగా ప్రభాస్‌తో చేస్తోన్న చిత్రం డిలే అవడంతో ఆ డేట్లు ఇటు షిఫ్ట్ చేసి ఈ ఛాన్స్ నిలబెట్టుకుంది.
ఆల్రెడీ క్రేజ్ విపరీతంగా వుండడంతో పాటు ఇప్పుడు పెద్ద సక్సెస్ కూడా రావడంతో పూజ డిమాండ్ బాగా పెరిగింది. ఇదే సమయంలో బాలీవుడ్‌లో కూడా హౌస్‌ఫుల్ 4తో ఘన విజయం సొంతం చేసుకోవడంతో అక్కడ్నుంచి కూడా అవకాశాలు చాలానే వస్తున్నాయి. ఇప్పుడున్న క్రేజ్‌ని క్యాష్ చేసుకునే భారీ చిత్రాలే చేయాలనుకోకుండా చిన్న సినిమాల నుంచి కూడా భారీ పారితోషికం డిమాండ్ చేస్తూ బిజీగా వుంటోంది.