మార్కెట్ కు అమ్మఒఢి ఊపు

మార్కెట్ కు ఊపు రావాలి అంటే జనం దగ్గర డబ్బులు వుండాలి. సంక్రాంతి కి మార్కెట్ ఎందుకు ఊపుతో వుంటుంది అంటే, జనం దగ్గర ధాన్యం అమ్మిన పంట డబ్బులు వుంటాయి కాబట్టి. ఈసారి…

మార్కెట్ కు ఊపు రావాలి అంటే జనం దగ్గర డబ్బులు వుండాలి. సంక్రాంతి కి మార్కెట్ ఎందుకు ఊపుతో వుంటుంది అంటే, జనం దగ్గర ధాన్యం అమ్మిన పంట డబ్బులు వుంటాయి కాబట్టి. ఈసారి సంక్రాంతికి మరింత ఊపు వచ్చింది. కారణం జనం దగ్గర ఒక్కసారిగా 15వేల వంతున డబ్బులు వచ్చి వుండడమే.

అమ్మఒడి అంటూ జగన్ ప్రభుత్వం దాదాపు 80శాతం మంది తల్లులకు 15వేలు వంతున డబ్బులు వేసేసింది. సరిగ్గా సంక్రాంతికి ముందు వచ్చి పడ్డాయి ఈ డబ్బులు. దీంతో ముఖ్యంగా కోస్తా ఆంధ్రలో మార్కెట్ కు ఫుల్ ఊపు వచ్చింది. బట్టల దుకాణాలు, ఇంటి సామగ్రి దుకాణాలు, ఫర్నిచర్ దుకాణాలు, సినిమా హాళ్లు, ఆఖరికి బంగారం దుకాణాలు కళకళ లాడుతున్నాయి.

ఈ విషయంలో అనుమానం వుంటే ఉత్తర కోస్తా, తూర్పు, పశ్చమ తీరాలకు వెళ్లి కనుక్కోవచ్చు. చూసి రావచ్చు. 15వేలతో బంగారాలు రాకపోచవ్చు కానీ బట్టలు, ఇంటి సామాన్లు బాగా కొనుగోలు చేస్తున్నారు. ఈసారి పండగకు నాలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో రెండు సినిమాలకు భారీ రేట్లు పెట్టారు. అయినా కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి.

'అమ్మ ఒడి పథకం మా సినిమా ఇండస్ట్రీకి బాగా పనికి వచ్చింది 'అన్నారు విశాఖకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్. జనం టికెట్ రేట్ లెక్క చేయకుండా అన్ని సినిమాలు చూసేస్తున్నారు అని వివరించారు. సాధారణంగా పండగ సీజన్ బాగుంటుందని, అయితే ఈసారి ఊహించిన దానికన్నా ఎక్కవు వుందని, ముఖ్యంగా పండగ దాటాక కూడా బిజినెస్ లు బాగున్నాయని ఓ దుస్తుల దుకాణం యజమాని చెప్పారు. 

మనిషికి 15 వేలే కావచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి పథకం మీద ఖర్చు చేసింది టోటల్ గా చూసుకంటే వేల కోట్లు అన్ని డబ్బులు మార్కెట్ లోకి రావడం అంటే దానికి ఎంత ఊపు వస్తుందో అర్థం అవుతుంది.

నిఖార్సయిన అవకాశవాది పవన్ కళ్యాణ్