పూజకు వేళాయరా? రంగపూజకు వేళాయరా? అంటూ పాట వుంది. ఆ సంగతేమో గానీ చిరకాలంగా పుట్టెడు గడ్డంతో, తెల్లటి లాల్చీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను చూసి చూసి బోర్ కొడుతోంది. అత్తారింటికి దారేది, జల్సా లాంటి సినిమాల్లో మాదిరిగా క్లీన్ షేవ్ తో, టీషర్ట్ తో మళ్లీ మన పవర్ స్టార్ ను ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ రాజకీయాలు, రచ్చబండలు వారికి సంతృప్తినివ్వడం లేదు. ఏదో తమ అభిమానం కొద్దీ పవర్ స్టార్ అంటూ నినదిస్తున్నారంతే. నిజంగా వాళ్లకు పీకల్లోతు అభిమానం వుంటే పవన్ రెండు చోట్ల కాకుంటే ఒక చోట అయినా గెలచేవాడు. కానీ అదే పవన్ ను సినిమా చేయమనండి, ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. నెత్తిన పెట్టుకని మోస్తారు.
ఎప్పుడయితే జనసేన పార్టీ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేసారో ఇప్పుడు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా వున్నారు. ఎందుకంటే తమ హీరోను మళ్లీ హీరోగా చూడవచ్చని. గెడ్డం తీసేసి, డ్రెస్ మార్చేసి, తనకు అలవాటైన స్టయిల్స్ చూపిస్తూ తమని అలరిస్తాడని. అయితే ఇదంతా ఇప్పటికిప్పుడు జరిగిపోదు. వచ్చే నెల నుంచి సెట్ మీదకు వస్తారు. మే లో సినిమా విడుదలవుతుంది.
వచ్చే నెల నుంచి ఏదో మూల నుంచి సెట్ మీద పిక్చర్స్ లీక్ అవుతుంటూనే వుంటాయి. పవర్ స్టార్ ను పొలిటికల్ స్టార్ మాదిరిగా కాకుండా సినిమాస్టార్ మాదిరిగా చూడొచ్చు.