గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఇదే

ఈరోజు ఉదయం గేమ్ ఛేంజర్ టైటిల్ ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి అతడి లుక్…

ఈరోజు ఉదయం గేమ్ ఛేంజర్ టైటిల్ ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి అతడి లుక్ ను విడుదల చేశారు మేకర్స్.

బైక్ పై స్టయిలిష్ గా కూర్చొని, వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు. అతడి హెయిర్ స్టయిల్ ఆకర్షిస్తోంది.

ఏ సినిమా చేసినా అందులో హీరోను డిఫరెంట్ గా, తనదైన శైలిలో చూపించడం శంకర్ స్పెషాలిటీ. గేమ్ ఛేంజర్ లో కూడా చరణ్ ను అలానే చూపించాడు. అయితే ఈ హెయిర్ స్టయిల్ చరణ్ కు కొత్తేంకాదు. గతంలో బ్రూస్ లీ సినిమాలో దాదాపు ఇదే రకమైన హెయిర్ స్టయిల్ తో కనిపించాడు ఈ మెగాహీరో.

మొత్తమ్మీద చరణ్-శంకర్ సినిమాకు సంబంధించి 2 అప్ డేట్స్ ఒకే రోజు వచ్చేశాయి. ఉదయం టైటిల్, మధ్యాహ్నానికి ఫస్ట్ లుక్ వచ్చేశాయి. ఇదే ఊపులో రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేస్తే బాగుండేది. కాకపోతే దానికి ఇంకా టైమ్ ఉంది.

శంకర్ సినిమాల షూటింగ్స్ ఎప్పటికి పూర్తవుతాయనేది ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఈ సినిమా విడుదల తేదీపై నిర్మాత దిల్ రాజు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. ఈ ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి రాదనేది మాత్రం పక్కా.

కియరా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. సముద్రఖని, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.