2021 సమ్మర్..నో బిగ్ మూవీ?

2020 సమ్మర్ లేకుండా పోయింది. దసరా సీజన్ గాయబ్ అయిపోయింది. 2021 సంక్రాంతి అనుమానంగా వుంది. ఇక మిగిలింది 2021 సమ్మర్.  Advertisement కానీ పరిస్థితి చూస్తుంటే థియేటర్లు ఆ వేళకు సెట్ అయినా,…

2020 సమ్మర్ లేకుండా పోయింది. దసరా సీజన్ గాయబ్ అయిపోయింది. 2021 సంక్రాంతి అనుమానంగా వుంది. ఇక మిగిలింది 2021 సమ్మర్. 

కానీ పరిస్థితి చూస్తుంటే థియేటర్లు ఆ వేళకు సెట్ అయినా, సరైన సినిమాలు వుంటాయా? అన్నది అనుమానంగా వుంది. 

ప్రభాస్ రాథేశ్యామ్ , పవన్ కళ్యాణ్ ఎకె రీమేక్ మినహా మరే సినిమా సమ్మర్ కు వస్తాయా? అన్నది అనుమానంగా వుంది. రాథేశ్యామ్ సమ్మర్ కన్నా ముందే రెడీ అయ్యే అవకాశం కూడా వుంది.

ఎందుకంటే…ఇప్పుడు నిర్మాణంలో వున్న పెద్ద సినిమాలు ఏవీ కూడా సమ్మర్ కు రెడీ అవుతాయని గ్యారంటీ కనిపించడం లేదు బన్నీ-సుకుమార్ సినిమా ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది. 

ఆరేడు నెలలు కనీసం పడుతుంది పూర్తి కావడానికి. పైగా సుకుమార్ సినిమా అంటే ఇంకా టైమ్ పడుతుంది. అందువల్ల మే వేళకు రెడీ అవుతుందా? అన్నది అనుమానమే.

ఇక కొరటాల శివ-మెగాస్టార్ ఆచార్య సంగతి కూడా అలాగే వుంది. ఇప్పటి వరకు షూట్ చేసింది చాలా తక్కువ. చేయాల్సింది ఎంతో వుంది. మెగాస్టార్ షూట్ కు రావాలి. అప్పుడు కానీ ఈ సినిమా విడుదల మీద ఓ అంచనా రాదు. పైగా రామ్ చరణ్ తో ఈ సినిమాకు పీట ముడి వుంది.

బోయపాటి-బాలయ్య సినిమాను భారీ సమ్మర్ సినిమాగా అనుకోవడానికి లేదు. పూరి జగన్నాధ్ సినిమాకు అమెరికా, లేదా మరో విదేశం లింక్ లు వున్నాయి. 

మహేష్ సర్కారువారి పాట కూడా అదే తీరు. అది ఇంకా ప్రారంభమే కాలేదు. అందువల్ల సరైన మీడియం సినిమాలు ఏవైనా సమ్మర్ ను టార్గెట్ చేస్తే లాభంగా వుంటుంది. దిల్ రాజు నిర్మిస్తున్న విక్రమ్ కుమార్-చైతన్యల సినిమా ఇదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

దోచుకున్నోడికి దోచుకున్నంత