డిజె టుల్లు అవుట్ రేట్ సేల్

సిద్దు జొన్నలగడ్డ హీరోగా సితార సంస్థ నిర్మించిన డిజె టుల్లు లక్ బాగుంది. సినిమా థియేటర్ రైట్స్ ను సింగిల్ పాయింట్ లెక్కన అమ్మేసారు. ఇప్పటికే శాటిలైట్ మినిమా నాన్ థియేటర్ రైట్స్ అన్నీ…

సిద్దు జొన్నలగడ్డ హీరోగా సితార సంస్థ నిర్మించిన డిజె టుల్లు లక్ బాగుంది. సినిమా థియేటర్ రైట్స్ ను సింగిల్ పాయింట్ లెక్కన అమ్మేసారు. ఇప్పటికే శాటిలైట్ మినిమా నాన్ థియేటర్ రైట్స్ అన్నీ అమ్మేసారు. 

ఓటిటికి వెళ్లాలంటే శాటిలైట్ అమ్మకూడదు కనుక అది పెండింగ్ లో పెట్టారు. అయితే జ‌నవరి 26న థియేటర్ విడుదలకే వెళ్తున్నారు కనుక, ఇప్పుడు థియేటర్ వరల్డ్ వైడ్ గా సింగిల్ బయ్యర్ కు అమ్మేసారు.

రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్ సీస్, నాన్ తెలుగు రాష్ట్రాలు అన్ని థియేటర్ హక్కులు కలిపి ఎనిమిది కోట్లకు కాస్త తక్కువగా విక్రయించినట్లు తెలుస్తోంది. డిజె టుల్లు టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే యూత్ కంటెంట్ మీద చాలా హోప్ వుంది. అందుకే ఈ రేంజ్ లో బెేరం జ‌రిగిపోయింది.

మొత్తం ఖర్చులు, అమ్మకాలు తీసేస్తే నిర్మాతకు దాదాపు నాలుగు కోట్లకు పైగానే లాభం మిగులుతుందని అంచనా. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకుడు.