ఎట్టకేలకు కాజల్ తన నిజజీవిత ప్రేమకథల్ని వివరంగా బయటపెట్టింది. గౌతమ్ తో తన రిలేషన్ షిప్ పై ఓపెన్ అయింది. పెళ్లి తర్వాత ఓ ప్రముఖ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో దాదాపు అన్ని విషయాల్ని బయటపెట్టింది కాజల్.
“గౌతమ్-నేను మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అంతకంటే ముందు ఏడేళ్లుగా మాకు పరిచయం ఉంది. అయినా మేమిద్దం ఒకర్ని విడిచి ఒకరం ఉండలేమనే విషయం ఈ లాక్ డౌన్ లోనే తెలుసుకున్నాం.
కరోనా వల్ల కొన్ని వారాల పాటు ఎడబాటు తప్పలేదు. దీంతో మాస్కులు వేసుకొని బయట కిరాణా షాపుల వద్ద కలుసుకునే వాళ్లం. అప్పుడే మాకు అర్థమైంది మేమిద్దం చాలా డీప్ గా ఉన్నామని.”
తమ ప్రేమను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాలనే విషయాన్ని అప్పుడే ఇద్దరం తెలుసుకున్నామంటోంది కాజల్. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిన వెంటనే గౌతమ్, కాజల్ ఇంటికి వచ్చాడు.
ఏప్రిల్ లో కాజల్ తల్లిదండ్రులకు విషయం మొత్తం చెప్పేశాడు. అప్పటికే కాజల్, తన తల్లిదండ్రులకు చూచాయగా హింట్ ఇవ్వడంతో అంతా ఓకే అనేశారు. ఇక డేటింగ్ విషయానికొస్తే.. గౌతమ్ కంటే తనే ఎక్కువ రొమాంటిక్ అంటోంది కాజల్.
“రొమాన్స్ విషయంలో గౌతమ్ కాస్త తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే అతడికి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేదు కదా. అదే నా విషయానికొస్తే రొమాన్స్ విషయంలో నాకు చాలా అనుభవం ఉంది. నా సినిమాలు నాకు కావాల్సినంత రొమాన్స్ ను నేర్పించాయి. కాబట్టి గౌతమ్ కంటే నేనే ఎక్కువ రొమాంటిక్ గా ఉంటాను.”
దాదాపు మే నెల నుంచి కాజల్-గౌతమ్ పెళ్లి పనుల్లో పడిపోయారు. నిజానికి ఈ జంట కూడా ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్ గురించే ఆలోచించింది. ఆ తర్వాత మహారాష్ట్రలోనే కొన్ని ప్రాంతాల్ని పరిశీలించింది. ఒక దశలో నాసిక్ వెళ్లి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట.
చివరికి ఇంట్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని, ఆఖరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని కూడా మార్చుకున్నారు.. కాజల్ ఇంటికి దగ్గర్లోనే ఉన్న తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
పెళ్లి దుస్తుల కోసం ఎక్కడికీ కదల్లేదంటోంది కాజల్. డిజైనర్లతో ఆన్ లైన్లో నే చర్చలు సాగించామని, ఆన్ లైన్ లోనే దుస్తులు, డిజైన్లు చూసి ఓకే చేసింది కాజల్. ఇక పెళ్లి ఏర్పాట్ల బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై కూడా కాజల్-గౌతమ్ చాలా వర్క్ చేసింది.
ఎన్నో కంపెనీల పేర్లు పరిశీలించి, ఫైనల్ గా చెన్నైకు చెందిన ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి తన పెళ్లి బాధ్యత అప్పగించింది కాజల్. పూర్తిగా పంజాబీ-కష్మీరీ సంప్రదాయాల్లో జరిగిన ఈ పెళ్లిలో జీలకర్ర-బెల్లం కాన్సెప్ట్ రావడానికి ఈ చెన్నై బేస్డ్ కంపెనీనే కారణం.