పొత్తు పాట ఎత్తుకున్న పచ్చ చిలకలు!

పెద్ద చిలక సంకేతం ఇచ్చి వదిలేసింది. ఇప్పుడిక పచ్చ చిలకలన్నీ పొత్తు పాట ఎత్తుకున్నాయి. సదరు ప్రియురాలి మనసు కరిగేదాకా ఈ చిలకలన్నీ పొత్తు రాగాలను ఆలపిస్తూనే ఉంటాయి. జగదేకవీరుని కథ సినిమాలో ఎన్టీ…

పెద్ద చిలక సంకేతం ఇచ్చి వదిలేసింది. ఇప్పుడిక పచ్చ చిలకలన్నీ పొత్తు పాట ఎత్తుకున్నాయి. సదరు ప్రియురాలి మనసు కరిగేదాకా ఈ చిలకలన్నీ పొత్తు రాగాలను ఆలపిస్తూనే ఉంటాయి. జగదేకవీరుని కథ సినిమాలో ఎన్టీ రామారావు.. ‘శివశంకరీ.. శివానందలహరీ..’ అంటూ పాట ఆలపించి.. బండరాయిని కరిగించినట్లుగా.. ఇప్పుడు తెలుగుదేశం పచ్చ చిలకలన్నీ కూడా.. ‘జై జనసేనానీ.. జైజై జనసేనానీ..’ అంటూ పవన్ కల్యాణ్ మనకు కరిగి.. కన్నుగీటుతున్న చంద్రబాబు వన్ సైడ్ లవ్ కు పచ్చజెండా ఎత్తేదాకా ప్రేమగీతాలు పాడుతూనే ఉంటారు. రాష్ట్రంలో వ్యవహారం చూస్తే ప్రస్తుతం అలాగే ఉంది. 

పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో దారుణ పరాభవం తప్పించుకోవాలని, అంతోఇంతో పరువు కాపాడుకోవాలని.. తెలుగుదేశం పార్టీ వారందరికీ ఇప్పుడు చాలా చాలా కోరికగా ఉంది. తమ అధినేత చంద్రబాబునాయుడు.. తనంతగా బయటపడితే పరువు పోతుందనే బెరుకు కూడా లేకుండా.. ఓపెన్ గా.. తన వన్ సైడ్ లవ్ ను బయటపెట్టేసిన తర్వాత.. ఆ పాటను అందరూ అందిపుచ్చుకుంటున్నారు. జనసేనను ప్రసన్నం చేసుకోవాలి. పవన్ కల్యాణ్ తమ నాయకుడు చంద్రబాబు ప్రేమను యాక్సెప్ట్ చేసే వాతావరణం రావాలి.. అనేదే ఇప్పుడు అందరికోరిక. 

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఈ విషయంలో మాట్లాడుతూ.. జనసేనతో పొత్తుల గురించి ఆసక్తికర సంకేతాలు ఇచ్చారు. తమతో తమ ఆలోచనలతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకోడానికి సిద్ధంగా ఉన్నాం అని ఆయన వెల్లడించారు. నేరుగా ఆయన పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించలేదు గానీ.. చంద్రబాబు మనోగతం ఎరిగి అందరూ నడుచుకునే ఆ పార్టీలో.. పవన పొత్తుల కోసమే ఇప్పుడు అందరూ ఆరాటపడుతున్నారనేది సత్యం. 

అసలే ఇన్నాళ్లూ ఒకవైపు పవన్ కల్యాణ్ అర్థం పర్థం ఉండని తన ఆవేశపూరిత ప్రసంగాల్లో చంద్రబాబునాయుడు పాలనను, లోకేష్ చేతగాని తనాన్ని పలుసందర్భాల్లో తీవ్రంగా విమర్శించారు. అయినప్పటికీ.. తెలుగుదేశం శ్రేణులు ఎన్నడూ ఆయనకు గట్టి కౌంటర్లు ఇవ్వడానికి సాహసించలేదు. ఇప్పుడు చంద్రబాబు వన్ సైడ్ లవ్ ను బట్టి పాత సంగతులు కూడా పరిశీలిస్తే.. పవన్ తో ఏనాటికైనా బంధం తప్పదని ఫిక్సయిపోయి.. ఆయనమీద ఎన్నడూ విమర్శలు చేయకూడదని.. చంద్రబాబు తొలినుంచి పార్టీ శ్రేణులకు నిర్దేశించి ఉన్నట్లుగా అర్థమవుతోంది. 

వీళ్లందరూ ఇంతగా తహతహలాడుతూ ఉండే కొద్దీ.. తానేదో అతిపెద్ద నాయకుడినని, తాను రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చేయగల బలసంపన్నడినని.. పవన్ కల్యాణ్ కొత్త భ్రమల్లో పడిపోతాడో ఏంటో ఖర్మ!