హారిక హాసిని సిస్టర్ కన్సర్న్ మాంచి ఊపు మీద వుంది. దాదాపు ఎనిమిది చిన్న, మీడియం, పెద్ద సినిమాలు ప్లాన్ చేస్తోంది. రంగ్ దే లాంటి మీడియం రేంజ్ సినిమా ఫినిషింగ్ స్టేజ్ లోవుంది.
నాగశౌర్యతో ఓ సినిమా సెట్ మీద వుంది. కప్పెల మలయాళ సినిమా రీమేక్ కు రెడీ అవుతోంది. విష్వక్ సేన్ ఒక హీరోగా ఫిక్స్ అయ్యారు. మరో హీరో ఫిక్స్ కావాల్సి వుంది.
ఇవి కాక సిద్దు జొన్నలగడ్డతో హీరోగా ఒకటి సుధీర్ వర్మ డైరక్షన్ లో మరొకటి దాదాపు ఫిక్స్ అయ్యాయి. ఇవి కాక కొత్త డైరక్టర్లు చెప్పిన రెండు కథలను ఓకె చేసారు. వాటికి హీరోలను సెట్ చేయాల్సి వుంది.
హీరోల వేట సాగుతోంది. శ్రీవిష్ణు, గణేష్ బెల్లంకొండ, ఇంకా పలువురు హీరోల పేర్లు పరిశీలనలో వున్నట్లు బోగట్టా.ఇవన్నీ ఇలా వుండగానే పవన్-రానా కాంబినేషన్ లో అయ్యప్పన్ రీమేక్ వుండనే వుంది.
మెయిన్ బ్యానర్ హారిక హాసిని ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తూ ఖాళీగా వుంది. ఆ గ్యాప్ ను సితార ఎంటర్ టైన్మెంట్స్ పూరిస్తున్నట్లు కనిపిస్తోంది.