అయ్యో…బాలయ్య

సీనియర్ బాలకృష్ణ పరిస్థితి మరీ దారుణంగా వుంది. ఏ విషయంలో అంటే, హీరోయిన్ల విషయంలో. అస్సలు హీరోయిన్లే దొరకడం లేదు. Advertisement సీనియర్ హీరోలు అందరికీ ఇదే పరిస్థితి. కానీ మిగిలిన వారికి బడ్జెట్…

సీనియర్ బాలకృష్ణ పరిస్థితి మరీ దారుణంగా వుంది. ఏ విషయంలో అంటే, హీరోయిన్ల విషయంలో. అస్సలు హీరోయిన్లే దొరకడం లేదు.

సీనియర్ హీరోలు అందరికీ ఇదే పరిస్థితి. కానీ మిగిలిన వారికి బడ్జెట్ రీత్యానో, క్రేజ్ రీత్యానో ఎవరో ఒకరు సెట్ అవుతున్నారు. కానీ బాలయ్య పరిస్థితి మాత్రం అలా కాదు.

ఎవరిని అడిగినా చేయమని చెబుతున్నారని బోగట్టా. ఆఖరికి ఆ మధ్యన ఓ సినిమా చేసిన అంజలిని అడిగాన చేయనని చెఫ్పినట్లు తెలుస్తోంది.

మొత్తానికి బాలయ్య కోసం దర్శకుడు బోయపాటి ఓ మలయాళీ హీరోయిన్ ప్రయాగ మార్టిన్ ను తీసుకువచ్చారు. ఈ విషయం ఆ మధ్య వార్తల్లోకి వచ్చింది.  

ఇప్పుడు రెండో హీరోయిన్ గా ఓ చిన్న హీరోయిన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అల్లరి రవిబాబు తో ఒకటి రెండు సినిమాలు చేసి, ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక, ఢీ లాంటి టీవీ షో లు చేస్తున్న పూర్ణ ను తీసుకున్నారట. ఈ రోజే అగ్రిమెంట్ చేసుకున్నారు.

సినిమాకు బడ్జెట్ ను కంట్రోల్ చేసే పనిలో వున్నారు బోయపాటి. పూర్ణ రెమ్యూనిరేషన్ ఇంత అని తెలియదు కానీ మహా అయితే పది లక్షలకు అటు ఇటు వుంటుందని టాక్ వుంది. 

అల్లరి నరేష్, అల్లరి రవిబాబు లాంటి వారి పక్కన చిన్న సినిమాలు చేసిన పూర్ణ ఇప్పుడు ఇన్నేళ్ల గ్యాప్ తరువాత బాలయ్య పక్కన చేయడం అంటే ఆమెకు ప్లస్ నే కావచ్చు కానీ బాలయ్యకు మాత్రం మైనస్సే అనుకోవాలి.

శాపనార్థాలు, ఆక్రోశాలు తప్ప వారికేం మిగిలట్లేదు