టైమ్ బాగాలేకపోవడంతో పాండవులు లాంటి వీరులు టైమ్ బాగాలేక అడవుల పాలై, అజ్ఞాతవాసం చేసారు. డైరక్టర్ కొరటాల శివ వ్యవహారం అలాగే వుంది.
ఏ ముహుర్తాన ఆచార్య సినిమాను స్టార్ట్ చేసారో అప్పటి నుంచి ఒకటి కాదు రెండు కాదు. ఎన్నో అవాంతరాలు. 2018 ఏప్రియల్ లో విడుదలయింది భరత్ అనే నేను. అంటే దాదాపు రెండేళ్లు దాటిపోయింది.
ఆచార్య సినిమా విడుదల 2021 విడుదల టార్గెట్ గా వుంది. అంటే దాదాపు ఓ టాప్ డైరక్టర్ కెరీర్ లో మూడేళ్ల కాలం కేవలం ఓ సినిమా మీద గడచిపోతోంది. అలా అని అదేమీ బాహుబలి రేంజ్ సినిమా కాదు. అయితే ఇంత ఓర్పు పడతున్నా సినిమా ఎప్పుడు రెడీ అవుతుందీ అన్నది అనుమానంగా వుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అభిమతం మేరకు ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ పెంచుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం రైటర్ శ్రీధర్ సీపాన సాయం తీసుకుంటున్నారని తెలుస్తోంది.
గతంలో అనేక కామెడీ సినిమాలకు పనిచేసిన శ్రీధర్ సీపాన, ప్రస్తతం మెగా అల్లుడు నటిస్తున్న సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. స్క్రిప్ట్ లకు సాయం చేయించడం అన్నది మెగాస్టార్ కు అలవాటే. సైరా సినిమాకు కూడా సురేందర్ రెడ్డి కి అటు ఇటు పరుచూరి బ్రదర్స్ ను, సత్యానంద్ ను పెట్టారు. ఇప్పుడు కూడా అలాగే సెట్ చేసినట్లు కనిపిస్తోంది
నిజానికి కొరటాల శివ మంచి రైటర్. ఆయన తన స్క్రిప్ట్ లు తానే సోలోగా రాసుకుంటారు. టీమ్ అంటూ వుండదు. కానీ ఇప్పుడు ఆయన కూడా సీపాన శ్రీధర్ తో పాటు మరొకరి సాయం కూడా తీసుకుంటున్నారని బోగట్టా.
మెగాస్టార్ కు నచ్చే విధంగా స్క్రిప్ట్ ను తీర్చి దిద్దాలి కదా? పైగా ఆర్ఆర్ఆర్ పూర్తి కావాలి. చరణ్ రావాలి. వ్యాక్సీన్ రావాలి. మెగాస్టార్ సెట్ కు రావాలి.
ఇదంతా చూస్తుంటే పాపం, కొరటాల శివ డైరీలో 2021 కూడా మాయం అయిపోయేలా కనిపిస్తోంది. ఆచార్య విడుదలయిన తరువాత కానీ బన్నీ సినిమా మీదకు రాలేదు. ఆ రోజు ఎప్పుడో?