హీరోయిన్ అమృతారావు పండంటి మగబిడ్డకు ఆదివారం జన్మనిచ్చారు. నటి అమృతారావు -ఆర్జే అన్‌మోల్ ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
త్వరలో తాను బిడ్డకు జన్మనివ్వనున్నట్టు అమృతారావు నెల క్రితం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అమృతారావు, ఆర్జే ఆన్‌మోల్ దంపతుల ప్రేమకు ప్రతిరూపంగా మగబిడ్డ వాళ్ల జీవితంలోకి అడుగు పెట్టాడు. దీంతో ఆ దంపతులతో పాటు సంబంధీకుల ఆనందానికి అవధుల్లేవు.
అమృతారావుకు మగబిడ్డ జన్మించినట్టు ఆమె టీం ప్రకటించిన నేపథ్యంలో … పలువురు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
బాలీవుడ్‌లో పలు హిట్ సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అమృతా …టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేశ్‌బాబుతో కలిసి అతిథి సినిమాలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు.
ప్రస్తుతం ఆమె ఓ ప్రముఖ చానల్‌లో ప్రసారమవుతున్న జమ్మీన్ అనే మ్యూజిక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.